ప్రైవేట్‌పరం చేసి జీవితాలను నాశనం చేస్తారా?
- 14 Views
- admin
- August 26, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు
బహిరంగ సభలో సీపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు హెచ్చరిక
కార్పొరేషన్, ఫీచర్స్ ఇండియా : ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేసి, ప్రజల జీవితాలను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతో మోడి, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘరావులు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచనను నిరసిస్తూ సిపిఎం జివిఎంసి గాంధి విగ్రహం వద్ద శనివారం భారీ బహిరంగ సభను నిర్వహించింది. తొలుత విశాఖ రైల్వే స్టేషన్ నుంచి జివిఎంసి గాంధి విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ, విశాఖలో ప్రభుత్వరంగ పరిశ్రమలు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ముందు చూపుతో వ్యవహరించకపోతే ఉపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు విశాఖపట్నం ఒక కుగ్రామంలా వుండేదని, స్టీల్‌ప్లాంట్, భెల్, డాక్‌యార్డు వంటి ప్రభుత్వరంగ సంస్థలు ప్రారంభంతో అందరికి ఉపాధి దొరకడమే కాకుండా, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదిగిందన్నారు. గతంలో పలు కంపెనీల సీఈవోల సమావేశం జరిగిందని, ఎంతో ఉపయుక్తకరమైన ఈ సమావేశంలో ప్రముఖ ఆర్ధిక వేత్త అరవింద్ పనగారియా ఆర్ధికవేత్త కొలంబియా యూనివర్శిటి నుంచి వచ్చారని, ఆయన్ను నీతి ఆయోగ్‌కు నాయకత్వం వహించేందుకు కోరగా ఆయన ఉద్యోగాన్ని వదిలి, దేశ అభివృద్ధి కోసం 15ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశారని తెలిపారు. అనంతరం ఆయన నీతి ఆయోగ్‌ను విడిచిపెట్టి, కొలంబియా వర్శిటికి వెళ్లిపోయారని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలో, 2016 లెక్కలు ప్రకారం 235ప్రభుత్వ రంగ పరిశ్రమలు వుండగా, వాటిలో ఆరు పరిశ్రమలు మూసివేయాలని, 20 అమ్మివేయాలని, 74 పరిశ్రమలు నష్టాల్లో వున్నాయని నివేదికలో తేల్చడం జరిగిందన్నారు. బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన టెండర్లలో డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టును దక్కించుకోవడం జరిగిందన్నారు. అంతటి ప్రఖ్యాత సంస్థ లాభాల బాటలో నడుస్తుంటే, ఈనాడు ప్రైవేట్ పరం చేయాలని చూడటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. జింక్‌కు చెందిన 265 ఎకరాలు స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైల్వేలను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నం, ప్రజలపై వున్న ప్రేమ కాదని, ఇది పూర్తిగా సవతి ప్రేమని అని అన్నారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఆస్థులను విక్రయించేందుకు కేంద్రం యోచిస్తుంటే, అందుకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతుందని దుయ్యబట్టారు. గతంలో నిజాం షుగర్స్‌ను చంద్రబాబుకు విక్రయించారని, ప్రస్తుతం దాని విలువ రూ.600కోట్లు ఉటుందని అన్నారు. ఇదే తరహాలో ప్రభుత్వాలు ఆలోచించి, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని విమర్శించారు. రైల్వే, స్టీల్‌ప్లాంట్, సెయిల్ సంస్థల్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని, ప్రైవేట్ యాజమాన్యాలు వీరి ఉద్యోగ భధ్రతను గాలికి వదిలేసి, ఆస్థులను అమ్ముకుపోతారని హెచ్చరించారు. రక్షణ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచన ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను మనందరిపైనా వుందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచనలు చేయాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.