చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ మిశ్రా
- 24 Views
- admin
- August 28, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: 45వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ దీపక్ మిశ్రా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. దీపక్ మిశ్రాతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదివరకు 44 వ సీజేఐగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్ ఉన్నారు. 1977 లో లాయర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు మిశ్రా. 1996 లో ఒరిస్సా హైకోర్ట్ అడిషనల్ జడ్జ్ గా ఆయనను నియమించారు. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ లో పని చేశారు. 2009లో పాట్నా హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. 2010లో ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2011లో సుప్రీం కోర్టులో అపాయింట్ అయ్యారు మిశ్రా.