సంక్షోభంలో పళని-పన్నీర్ సర్కారు
- 19 Views
- admin
- August 28, 2017
- జాతీయం తాజా వార్తలు
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి మరో గండం పొంచి ఉంది. ఇవాళ అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఏర్పాటు చేసిన సమావేశా నికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కోసం సర్వసభ్య సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంతటి కీలక సమావేశానికి ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దినకరన్ తనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అందులో 19 మంది ఇప్పటికే గవర్నర్‌ను కలిసి తమకు పళనిపై విశ్వాసం లేదని చెప్పారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని
డిమాండ్ చేశారు. ఆదివారం డీఎంకే కూడా సభలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు మెమొరాండం సమర్పించింది. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని, శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 19 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చెరి రిసార్ట్‌లోనే ఉన్నారు. సభలో బలపరీక్షకు గవర్నర్ ఆదేశించిన తర్వాతే వాళ్లంతా బయటకు రానున్నారు.


