జపాన్ మీదుగా కొరియా మిస్సైల్ ప్రయోగం
- 19 Views
- admin
- August 29, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా మళ్లీ మిస్సైల్ ఫైర్ చేసింది. ఈ సారి ఏకంగా జపాన్ దీవి మీద నుంచి ఆ మిస్సైల్‌ను పరీక్షించింది. ఈ ఘటన పట్ల జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా వల్ల జపాన్‌కు తీవ్ర ప్రమాదం ఉందని ఆ దేశ ప్రధాని షింజో అబే ఈ సందఠంగా అన్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తున్నది. జపాన్‌కు చెందిన హొక్కైడో దీవి మీద నుంచి మిస్సైల్ వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హుటాహుటిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి ఇటీవల నార్త్ కొరియా పదేపదే క్షిపణులను పరీక్షిస్తూనే ఉన్నది. కానీ జపాన్ దీవి మీదుగా ప్రొజెక్టల్స్ను పరీక్షించడం చాలా రేర్. దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం టెన్షన్‌గా మారింది. నార్త్ కొరియా గతంలోనూ జపాన్ మీదగా రాకెట్లను ఫైర్ చేసింది. 1998, 2009 సంవత్సరాల్లోనూ ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే అవి ఆయుధాలు కాదు, శాటిలైట్ ప్రయోగాలు అని నార్త్ కొరియా పేర్కొన్నది. నార్త్ కొరియా మిస్సైల్‌ను పరీక్షించిన నేపథ్యంలో ప్రజలంతా షెల్టర్ తీసుకోవాలని జపాన్ ప్రకటన చేసింది. అయితే కొరియా ప్రయోగించిన మిస్సైల్ సుమారు 2700 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. 550 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్‌లో మిస్సైల్ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. జపాన్ తీరంలో క్షిపణి మూడు ముక్కలై పడినట్లు భావిస్తున్నారు. అయితే ఆ మిస్సైల్‌ను షూట్ చేయాలన్న ప్రయత్నాలకు జపాన్ వెళ్లలేదు. ప్రస్తుతం హొక్కైడాలోనే జపాన్, అమెరికాకు చెందిన దళాలు సైనిక విన్యాసాలు చేస్తున్నాయి.