బాబా గుర్మీత్ ఓ క్రూర మగం ప్రత్యేక సిబిఐ కోర్టు
- 17 Views
- admin
- August 29, 2017
- జాతీయం తాజా వార్తలు యువత
రోహతక్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను క్రూర మగంగా ముద్ర వేసింది ప్రత్యేక సీబీఐ కోర్టు. రేప్ కేసులో డేరా బాబాపై తీర్పు చెప్పిన జడ్జి జగదీప్ సింగ్ తన తీర్పులో ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన భక్తురాళ్ల పట్ల రహీమ్ అడవి మ గంలా వ్యవహరించాడని కోర్టు అభిప్రాయపడింది. స్వంత భక్తురాళ్లను అతను వదలలేదు, అతనో క్రూర మగంగా ప్రవర్తించాడు, అలాంటి వ్యక్తులకు క్షమాభిక్ష ఉండదని జడ్జి తన తీర్పులో స్పష్టం చేశారు. ఆధ్మాత్మిక గురువుగా పేరుగాంచిన గుర్మీత్ అత్యంత పవిత్రమైన భారత భూమికి తీరని నష్టాన్ని మిగిల్చాడని ఆరోపించింది. రామ్ రహీమ్ తన భక్తుల పట్ల ఎటువంటి మానవత్వాన్ని ప్రదర్శించలేదని న్యాయమూర్తి అన్నారు. క్షమాగుణం లేని అతను, తన అనుచిత చర్యలతో భక్తులను ఇబ్బందిపెట్టారని కోర్టు పేర్కొన్నది.
శిక్ష విషయంలో కోర్టు నుంచి ఎటువంటి దయాదక్షిణ్యాలను ఆశించవద్దు అని జడ్జి తన తీర్పులో వెల్లడించారు. రెండు రేప్ కేసులకు కలిపి గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు అయ్యింది. బాధిత మహిళలు ఇద్దరూ రామ్ రహీమ్‌ను దేవుడిలా పూజించారని, తనను గుడ్డిగా విశ్వసించిన భక్తుల పట్ల అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్మీత్‌పై తీవ్ర స్థాయిలో న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. నేనే దువున్ని అంటూ డేరా బాబా తనదైన స్టయిల్లో నేరాలకు పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది.
వివిధ కేసుల్లో రేప్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను జడ్జి జగదీప్ సింగ్ తన తీర్పులో ప్రస్తావించారు. రేప్ ఒక శారీరక దాడి మాత్రమే కాదు అని, అది బాధితులను మానసికంగా నిస్సత్తువుగా మార్చేస్తుందని, అందుకే నిందితుడికి కఠినమైన శిక్ష వేయాలని, అప్పుడే సమాజ రక్షణ జరుగుతుందని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. డేరా బాబా కేసులో ఉన్న ఇద్దరు రేప్ బాధితులకు చెరో 14 లక్షలు ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాబా గుర్మీత్‌కు ఫైనాన్షియల్ కష్టాలు లేవని, అతని దగ్గర కావాల్సినంత సొమ్ము ఉందని, అతను బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొన్నది.