హైదరాబాద్: ఉత్తరాంధ్రలోని మూడు ప్రధాన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు గతజపతినగరం, డెంకాడ, బొండపల్లి, నెల్లిమర్ల, గంట్యాడ.. విశాఖ జిల్లాలోని పద్మనాభం, అనంతగిరి, అరకులోయ.. శ్రీకాకుళం జిల్లాలోని భామిని, రణస్థలం, మందస తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.