ప్రియాంక గర్భిణి కాదని స్పష్టం చేసిన మధు చోప్రా
- 10 Views
- admin
- February 19, 2019
- Home Slider తాజా వార్తలు యువత సినిమా
దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా ఎప్పుడు ఏదో ఒక టాపిక్‌తో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. గత ఏడాది నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గ్లోబల్ భామ అయిన ఈ అమ్మడు బాలీవుడ్లో ఓ చిత్రం, హాలీవుడ్లో ఓ చిత్రం చేస్తుంది. అయితే ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రా వెరైటీ డ్రెస్‌లో మెరిసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ఫోటోలో ప్రియాంక లావుగా కనిపించడంతో పాటు గర్భం దాల్చినట్టుగా ఉందని పలు మీడియా పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై ప్రియాంక తల్లి మధు చోప్రా క్లారిటీ ఇచ్చింది.
కెమెరా యాంగిల్ వలన ఆమె లావుగా ఉండడంతో పాటు గర్భం దాల్చినట్టు కనిపించిందే తప్ప, ఆమె తల్లి కాబోతుందనే వార్త అవాస్తవం అంటూ మధు చోప్రా మీడియాతో తెలిపింది. ప్రియాంక గర్భిణి అనే వార్తలని చూసి నేను షాక్ అయ్యాను. వెంటనే ప్రియాంకకి కాల్ చేసి ఏంటమ్మా ఇది అని అడిగాను. ఆ సమయంలో తాను అలసిపోయి ఉండడంతో ‘అమ్మా నాకు విరామం కావాలి’ అని తెలిపినట్టు మధుచోప్రా స్పష్టం చేసింది. విషయం తెలుసుకోకుండా తప్పుడు వార్తలని ప్రచారం చేయోద్దని కూడా ఆమె అన్నారు. ప్రియాంక నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా,ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు హిందీలో ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటిస్తుంది ప్రియాంక. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.


