ఎమ్మెల్యే సీటు మాకొద్దు బాబోయ్ !!
- 12 Views
- admin
- February 21, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
రసకందాయంలో యలమంచిలి రాజకీయం—————–
తెలుగుదేశం సీటు వద్దంటూ నాయకులు దూరం…దూరం———-
పోటీ చేయడానికి జంకుతున్న సీనియర్లు
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు సైతం వెనుకడుగు——————
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: రాజకీయ పరి స్ధితులు ఎప్పటికి ఎలా మారతాయో తెలీదనడానికి ప్రస్తుత యలమంచిలి నియోజకవర్గ తాజా రాజకీయ సరి స్థితి గమనిస్తే తెలిసివస్తుంది. అన్ని వర్గాలవారికీ మేలు కలిగే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం తాయిలాలు ప్రక టించింది. ముఖ్యంగా రైతులు, వ్వాక్రా మహిళలకు ఊహించని విధంగా లబ్ధిచేకూర్చింది. ఎన్నికల బరిలోకి దిగే ప్రత్యర్ధపార్టీలకు మింగుడుపడని విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. సహజంగా ఈ పరిస్థితిలో తెలుగుదేశం ఎమ్మెల్యే సీటుకోసం పార్టీలో కుమ్ములాటలు మొదలు కావాలి. అయితే యలమంచిలిలో మాత్రం సీటు వద్దం టూ నాయుకులంతా దూరం జరగడం విచిత్రంగా ఉంది. సీటు ఎవరికి కేటాయించాలా అని అధిష్టానం పార్ల మెంటరీ నియోజకవర్గాల వారీగా చర్చలు జరుపుతుంటే … అక్కడిదాకా ఎందుకు ఇక్కడే కూర్చొని అభ్యర్ధిని తేల్చేద్దామని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం నేతలంతా డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీ రావు ఇంట్లో సమావేశమయ్యారని అత్యంత విశ్వాసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ సమావేశానికి తులసీరావుతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పార్టీ సీనియర్ లీడర్లు లాలం భాస్కరరావు, గొంతిన నాగేశ్వరరావు హాజరయ్యారు.
ముందుగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ తనకు యలమంచిలి కంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంపైనే ఆసక్తి ఉందని అందుకని మరోకరికి అవకాశం ఇద్దామని నిర్ణయించారు. పంచకర్ల కానప్పుడు స్థానిక నేతకే ప్రాధా న్యం ఇద్దామని నిర్ణయించారు. అప్పుడు తులసీరావు కుటుంబం అభ్యర్ధిత్వంపై చర్చ మొదలైంది. ససేమిరా తాము పోటీలో ఉండబోమంటూ తులసీరావు తేల్చి చెప్పేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి మరో రెండేళ్లు ఉంది కాబట్టి, అయినా రాజకీయాల నుంచి విరమించుకుందా మనుకుంటున్న తరుణం కావున లాలం భాస్కరరావుకు సీటు ఇద్దామన్నారు. అయితే లాలం ఎమ్మెల్యే బరిలో దిగి ఖర్చుపెట్టేంత ఆర్ధిక సోమత తన దగ్గర లేదని భాస్కర రావు సీటు వద్దన్నారు. మిగిలిన గొంతిన నాగేశ్వరరావు కూడా ఆర్ధిక స్తోమత కారణంగా సీటును తిరస్కరించారు. అందరూ సీటు వద్దన్న నిర్ణయానికి రావడంతో కూర్చున్న నేతలంతా కాస్త ఇరకాటంలో పడ్డారు. మరికాస్త చర్చించాక రెండోసారి కూడా పంచకర్లను యలమంచిలి నుంచే బరిలోకి దించాలని నిర్ణయించారు. ఒకవేళ అది కానప్పుడు తులసీరావు కుమారుడు ఆనంద్‌కుమార్ అభ్యర్ధిత్వాన్ని బలపరచాలని నిర్ణయించారు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి ప్రగడ నాగేశ్వరరావు తెలుగుదేశంలోకి వస్తే మూడో అభ్యర్ధిగా నిలవవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయంంగా తెలిసింది.


