ఏయూతో ఇండియన్ నేవీ ఎంఓయూ
- 12 Views
- admin
- February 21, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఏయూ, ఫీచర్స్ ఇండియా: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇండియన్ నేవీ నాలుగు అవగాహన ఒప్పందాలను చేసుకుంది. డిల్లీలోని సేనా భవన్లో వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ఇండియన్ నేవీ కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్ గుప్తాలు సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ఇండియన్ నేవీ అధికారులకు పిహెచ్‌డిలో ప్రవేశాలు కల్పించడం, ఇండియన్ నేవీ టెక్నికల్ స్టాఫ్‌కు ఎంటెక్‌లో ప్రవేశాలు కల్పించడం, నేవల్ కేడెట్స్‌కు లేటరల్ ఎంట్రీలో బిటెక్ ప్రవేశాలు కల్పించడం, దూరవిద్య ప్రవేశాలకు సంబంధించి ఈ ఎంఓయూలను చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఏయూ రక్షణ రంగాల విద్యా సమన్వయాధికారి ఉజ్వల్ కుమార్ ఘటక్ పాల్గొన్నారు.
డిసిఎన్ఎస్తో సమావేశమైన వీసీ: ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు డిప్యూటి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (డిసిఎన్ఎస్) వైస్ అడ్మిరల్ మురళీధర్ పవార్‌తో భేటీ అయ్యారు. దీనిలో భాగంగా ఏయూలో నెలకొల్పే ఏయూ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్‌కు ఆర్ధిక వనరుల సమకూర్చడంపై చర్చించారు. దీనిపై వైస్ అడ్మిరల్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు,ఏయూ రక్షణ రంగాల విద్యా సమన్వయాధికారి ఉజ్వల్ కుమార్ ఘటక్ పాల్గొన్నారు.


