నేరస్తులతో పోటీ
- 20 Views
- admin
- February 21, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర వైసీపీదే————
చేయని తప్పులను మనపై రుద్దే ప్రయత్నం————
అమరావతి, పోలవరం అడ్డుకోవడానికి ఎన్నో కేసులు పెట్టారు———–
టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు———————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : హత్యలు, దోపిడీలు,దౌర్జన్యాలు ఆ పార్టీకి అలవాటేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మనం నేరస్తులతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులతో అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ప్రతిపక్ష వైసీపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హత్యలు, దాడులు, దౌర్జన్యాలే వారికి తెలుసని, చేయని తప్పులను మనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి, పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేలా
ఎన్నో కేసులు పెట్టారని అన్నారు. మోదీ, అమిత్ షా, కేసీఆర్, జగన్ కుట్రలను టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కుట్రలను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నేరగాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నీచ చరిత్ర వైసీపీదని విమర్శించారు. అధికారం కోసం జగన్ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో గెలుపొందేలా పార్టీ కార్యకర్తలు పట్టుదలగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నామన్నారు. నాలుగు ఎంపీ సీట్లలో ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షల సందర్భంగా వీరితో స్వయంగా సీఎం భేటి అవుతారని తెలిపారు. తెదేపా గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలన్నారు.
గుంటూరులో రైతు ఆత్మహత్య రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసుల దెబ్బల వల్లే రైతు చనిపోయాడని కుటుంబసభ్యులతో పాటు, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. కుటుంబ కలహాలతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ రాజధాని ప్రాంతంలో ఈ ఘటన రాజకీయ కాక రేపింది.


