చంద్రబాబు ప్రభుత్వం దళితులను వేదిస్తోంది
- 12 Views
- admin
- February 22, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
రాష్ట్రంలో ప్రతిరోజూ ఎస్సీలపై వేదింపులే————
టీడీపీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ద్వజం—————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారికున్న చట్టాలను సైతం లైక్క చేయకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్తల వరకు నిత్యం దళితులను వేదింపులతో అవమానిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
దళితులను రక్షించాలని కోరుతూ శుశ్రుకవారం జీవీఎంసీ గాందీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. గాందీ మహాత్మునికి పూలతో నివాళులు అర్పించి దళితుల పట్ల టీడీపీ నేతలు చేస్తున్న దాడులను, దుర్భాషలను ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబునాయుడే ఎస్సీలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా దళిత కులంలో పుట్టాలనుకుంటారా అని మాట్లాడి ఆ కులాన్ని అవమానించారని ద్వజమెత్తారు. తరువాత మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరు అంటూ బహిరంగంగా మాట్లాడారని ద్వజమెత్తారు. ఇంకా రెండడగులు ముందుకేసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై ఏకంగా దాడికి పాల్పడ్డారని మహిళా ఎమ్మెల్యే వనజాక్షిని విచక్షణా రహితంగా ఈడ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని పోలీసులు సైతం ఆయనపై కేసు పెట్టే సాహసం చేయలేదన్నారు.
అక్కడితో ఆగకుండా రెండు రోజులు కిందట మీరు షెడ్యూల్డ్ కేస్టు వారు, వెనుకబడిన వారు మీకెందెకు రాజకీయాలు, మాకుపదవులు, మాతో మీకెందుకురా గొడవలు అంటూ దుర్భాషలాడినా ఆయన మాటలు వైరల్ అవుతున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే దళితుల పట్ల చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో అర్దం అవుతుందన్నారు. కేవలం కుల అహంకారంతో చింతమనేని సీఎం అండదండలు చూసుకొని విర్రవీగుతున్నారని దుమ్మెత్తిపోసారు. దళితులను ఉద్దరిస్తున్నాం వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నామంటూనే వారిని పబ్లిక్ గా విమర్శించడం చూస్తుంటే వారిపట్ల టీడీపీ ప్రభుత్వానికి నేతలకు ఎంత గౌరవం ఉందో అర్దమవుతుందన్నారు. ఇప్పటికైనా దళితులు పట్ల చింతమనేని చేసిన వ్యాఖ్యలును ఉపసంహరించుకొని వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే ప్రభుత్వంనుంచి చింతమనేనిని బర్తరఫ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేసారు. తెలుగుదేశం నేతలు నుంచి దళితులను రక్షించాలన్నారు. దళితులకు ఈ ప్రభుత్వంలో రక్షణ కలరువైందని మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.


