ప్రేమజంటపై దాడి
- 14 Views
- admin
- February 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రేమికుడిపై అనుమానం——–
పొంతనలేని సమాధానాలు చెప్తున్న ప్రేమికుడు నవీన్———-
అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు—————
రాజమహేంద్రవరం, ఫీచర్స్ ఇండియా : కామవరపుకోట మండ లం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవ హారంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి నిన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మతిచెందగా, గాయాలతో బయటపడిన ప్రేమికుడు నవీన్‌ను పోలీసు లు విచారిస్తున్నారు. యువతి తలపై దుడ్డుకర్రతో బలంగా మోదడం వల్లనే మతి చెందినట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటలను (జ్యోతి ఘటన) ద ష్టిలో ఉంచుకుని పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తున్నారు. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ తలవెనుక భాగంలో బలమైన గాయలు అయినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా హత్యకు గురైన శ్రీధరణికి మార్చి9న దగ్గరి బందువు అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. యువతి మ తితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


