విశాఖలో తమ్ముళ్ల తన్నులాట !
- 11 Views
- admin
- February 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై వ్యతిరేకత———
అనితను ఓడిస్తామంటున్న తమ్ముళ్లు————-
పల్లాను మార్చాలని అధిష్టానానికి వినతులు——–
యలమంచిలిలో పోటీ చేయబోనంటున్న పంచకర్ల !————–
భీమిలిలో మంత్రి గంటా నెగ్గుకొస్తారా?————
దక్షిణంలో ఏకమవుతున్న ముస్లిం, మైనార్టీలు————-
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖ టీడీపీలో అసమ్మతి, వర్గపోరు పెరిగి పోతోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్‌లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడి స్తామంటూ అన్ని నియోజకవర్గాల్లోనూ తమ్ము ళ్లు వర్గపోరు కడుతున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ జిల్లా టీడీపీని ఇప్పుడు ఇంటిపోరు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న అధినేతకు అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిటింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జులపై, అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని అదే జరిగితే అంతేనని బాహాటంగానే చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో విశాఖలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 11 టీడీపీ, బీజేపీ 1, వైసీపీ 3 గెలుచుకున్నాయి. అనంతరం పాడేరు, అరకు ఎమ్మేల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు గెలిచిన వైసీపీని వదిలి అధికార టీడీపీలోకి వెల్లిపోయారు. దీంతో టీడీపీ బలం 13కు పెరిగింది. ఇంతవరకూ అందరూ అధికారాన్ని బాగానే అనుబవించారు. ఏమైందో ఏమోగాని ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వారిపై స్థానికంగా ఉంటున్న వారు అసమ్మతి సెగలు కక్కుతున్నారు. వారికి టికెట్లు ఇస్తే ఓడించా తీరుతామని ఎదురుతిరుగుతున్నారు. ఇన్నాళ్లు తమపై కర్రపెత్తనం చెలాయించ,ఇన ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దని తెగేసి చెబుతున్నారు. పాయకరావుపేట ఎమ్మేల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగానూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే కోటవురట్లలో అనితకు వ్యతిరేకంగా కొంతమంది అసమ్మతినేతలు సమావేశమయ్యారు. టీడీపీ ముద్దు-అనిత వద్దంటూ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే పై తీవ్ర అరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే అనితకు బదులు వేరే వారికి టిక్కేట్ ఇవ్వాలని లేదంటే ఆమెను ఓడించి తీరుతామని దీంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలు కూడా దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు. అనిత కు టికెట్ కేటాయిస్తున్నారన్న వార్తలు నేపద్యంలో అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని లేదంటే ఓటమి తప్పదని గట్టిగానే హెచ్చరికలు అందుతున్నాయి. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడైన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ డిమాండ్ చేశారు. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా కొంతమంది దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ పలువురు మాజీ కార్పోరేటర్లు అధిష్టానానికి చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై వారు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా గాజువాక నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన చెబుతున్నారు. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానని అలాంటిది పల్లాకు ఎలా మద్దతిస్తానని చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరు వల్లే కోన తాతారావు వంటి నేతలు పార్టీని వీడారని మళ్లీ పల్లాకు టికెట్ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరిస్తున్నారు. మాడుగులలో పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపు కట్టి తిరుగుబాటు ప్రకటించారు. మాడుగులలో పైకి అంతా సవ్యంగా కనిపిస్తున్నా అసమ్మతి నివురు గప్పిన నిప్పులా చాపకింద నీరులా ప్రవహిస్తుందని చెప్తున్నారు. భీమిలిలో సిటింగ్ ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ సారి గట్టి దెబ్బ తగలనుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. స్వయంగా ఆయన మిత్రుడే ప్రత్యర్ధిగా పోటీకి దిగడం అక్కడ వారు జీర్ణించుకోలేపోతున్నారు. ఆయన పై గంటా పోటీ చేస్తే ఓటమి తప్పదని భయపడుతున్నారు. ఇంకో ఎమ్మెల్యే పంచకర్ల కూడా ఈ సారి స్థానిక యలమంచిలి నుంచి కాకకుండా విశాఖ ఉత్తరం నుంచి పోటీకి దిగుతానని చెబుతున్నారట. అదే జరిగితే ఆ నియోజకవర్గం పై ఆశలు పెట్టుకున్న వారు మద్దతిస్తారా లేదోనని ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో రగులుతుంది. అంతేకాదు యలమంచిలి లో కన్నబాబురాజును ఢీకొట్టే వారు కూడా లేరని ఆయన్ను ఓడించడం అంత ఈజీ కాదని తమ్ముళ్లు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అధిష్టానం తమ్ముళ్లు మాట వింటుందా? లేక సిటింగ్‌లకే టికెట్లు ఇచ్చి అందరూ కలిసి గెలుపుకు కృషి చేయాలని చెబుతుందా వేచి చూడాలి.


