ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు
- 12 Views
- admin
- February 28, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఓ పక్క నిరసనలు-మరోపక్క ఏర్పాట్లు————-
ఉత్కంఠ రేపుతున్న ప్రదాని సభ———–
గట్టి బందోబస్తు ఏర్పాటు————–
మరిన్ని వరాలు గుప్పిస్తారంటున్న బీజేపీ శ్రేణులు—————-
విశాఖపట్నం, ఫీచర్స్ఇండియా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ వస్తున్నారు. శుక్రవారం నగరానికి వస్తున్న ఆయనకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం వద్ద భారీ కటౌట్లుతో పాటు మోదీ, రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లతో కూడిన కటౌట్లును భారీగా ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఫ్లెక్సీలు, కౌట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి వరకు నిరాశలో ఉన్న బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా ఈస్ట్ సౌత్ రౖౖెల్వేజోన్ ఏర్పాటకు ప్రకటన చేయడంతో ప్రదాని సభను మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ 1వ తేదీ సాయంత్రం 6:20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచీ సాయంత్రం 6:45 గంటలకు రైల్వే గ్రౌండ్స్ లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 7.45 గంటల వరకు పార్టీ అధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 8.10 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. మోదీ రాకతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసున్నారు. రాత్రి సమయంలో సభ జరగనుండడంతో కటుకటదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క మోదీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా నగరంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ప్రధాని గో బ్యాక్ అంటూ టీడీపీ శ్రేణులు తో పాటు రెండు రోజులుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ జీవీఎంసీ గాందీ విగ్రహం వద్ద నల్లదుస్తులతో నిరసన చేస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా హామీల అమలు సాధన జేఏసీ కూడా చేతికి సంకెళ్లు వేసుకొని అక్కడే నిరసన చేపడుతున్నారు. మరో పక్క వామపక్షాలు మోదీని విశాఖ రాకుండా అడ్డుకుంటాం అంటూ నగరంలో ర్యాలీలు, మోకాళ్లు పై నిరసనలు చేస్తున్న నేపధ్యంలో శుక్రవారం జరగబోయే ప్రధాని సభ పై ఉత్కంఠ రేగుతోంది. మరోపక్క రైల్వేజోన్ ప్రకటించిన ఆనందంలో బీజేపీ శ్రేణులున్నారు. ఈ ఉత్సాహంతో ప్రదాని సభను సక్సెస్ చేసేందుకు వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రదాని విశాఖ వేదికగా ఏం మాట్లాడుతారో…ఇంకేమి వరాలు గుప్పిస్తారో వేచి చూడాలి.


