ఓట్ల తొలగింపుపై వైసీపీవి తప్పుడు ఫిర్యాదులు
- 10 Views
- admin
- March 1, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
హైదరాబాద్ కేంద్రంగా ఓట్ల తొలగింపు కుట్ర ప్రతిపక్షం కుట్రపై అప్రమత్తంగా ఉండండి————
మరో ఐదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్————
నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు——
అమరావతి, ఫీచర్స్ ఇండియా : తెలుగుదేశం ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని వైకాపా తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చంద్రబాబు మండి పడ్డారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ముఖ్య మంత్రి చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వ హించారు. హైదరాబాద్ కేంద్రంగా ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్నారు. ఫారం-7ను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కట్టల కట్టలు దరఖాస్తులు పంపిస్తున్నారన్న విషయం పొన్నూరు, నర్సీపట్నంలో బయటపడిందని గుర్తుచేశారు. వేలాది ఓట్లు తొలగిం చాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, వైకాపా కుట్ర లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి కుట్రలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆదే శించారు. దొంగే దొంగ అనడం వైకాపాకు పరిపాటిగా మారిందని ఎద్దేవాచేశారతు. వాళ్లే ఓట్లు తొలగించి తెదేపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక మరో కుట్రలో భాగ మని, దీన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రజల నిరసన ఇవాళ ప్రతిబింబించాలని సూచించారు.
కేంద్రం ప్రకటించిన విశాఖ జోన్ ఓ మాయా జోన్ అని, భాజపా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుం దని విమర్శించారు. మరో ఐదారు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 13 నియోజకవర్గాల సమీక్షలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. యుద్ధం గురించి రెండేళ్ల క్రితం చెప్పారని పవన్ వ్యాఖ్యలే భాజపా దుర్మార్గ రాజకీయాలకు రుజువని చంద్రబాబు అన్నారు. తాజాగా యడ్యూరప్ప వ్యాఖ్యలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పారు.


