మోసం చేసిన మోదీ విశాఖ రావొద్దు
- 9 Views
- admin
- March 1, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
నల్లదుస్తులతో మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన———-
నల్ల బెలూన్లు ఎగరేసిన టీడీపీ నేతలు———
మోదీ అసమర్దుడన్న మంత్రి అయ్యన్న———-
అసంపూర్ణమైన జోన్ ఇచ్చారన్న మంత్రి గంటా—————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులు వేసుకొని నిరసన తెలపాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో టీడీపీ నేతలంతా శుక్రవారం జీవీఎంసీ గాందీ విగ్రహం వద్దకు వచ్చారు. మూెడు రోజులుగా ఎమ్మెల్యే నియోజక వర్గాల వారీగా ప్రధాని పర్యటనకు నిరసనగా వివిద రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్‌బాబు, పీలా గోవింద సత్యన్నారాయణ, నాయకులు శ్రీ భరత్, చింతకాయల విజయ్, పట్టాబి తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆ పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్లు నల్ల చొక్కాలతో వచ్చి ప్రధాని విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఆంధ్రాకు చేసిన అన్యాయం పై మంపడ్డారు. మోదీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ముక్త కంఠంతో నినాదాలు చేసారు. గత ఎన్నికల్లో తిరుపతి వెంకన్న దేవుని సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మీరు ఐదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను మరిచి సిగ్గులేకుండా విశాఖ ఎలా వస్తున్నారని మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. గత కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి చేయని మోదీ ప్రజానాయకుడిగా అసమర్ధుడన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇస్తామన్న మీరు ఇప్పుడు అసంపూర్ణమైన ప్రకటన చేసి ఆంధ్రులను మల్లీ మోసం చేయాలని చూడడం సిగ్గు చేటన్నారు. మాయమాటలతో ఆంధ్రులను మల్లీ మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్న మీరు కనీసం ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తే అభినందించాల్సిందిపోయి ఏపీ దేశంలో భాగమే కానట్టు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మల్లీ మాయ చేసేందుకు సిద్దమైతే ఇక్కడ ఎవరూ మోసపోరన్నారు. అనంతరం మోదీ పర్యటనకు నిరసనగా నల్లబెలూన్లును ఎగురవేసారు.


