అమోదీ గో బ్యాక్ నినాదాలతో దద్దరిల్లిన విశాఖ.. వామపక్షాలనేతలు అరెస్ట్
- 14 Views
- admin
- March 1, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఈడ్చుకెల్లి వ్యాన్లలో స్టేషన్లుకు తరలించిన పోలీసులు———
ఆంధ్రాకు అన్యాయం చేసిన మోదీ రావద్దని నిరసనలు————-
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఆంధ్రాకు అన్యాయం చేసిన ప్రధాని మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు, నిరసనలు నడుమ విశాఖ అట్టుడుకింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటు విభజన హామీల చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని నెరవేర్చని ప్రధాని విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని వామపక్షాల నేతలు గత మూడు రోజలుగా నిరసన చేపడుతున్నారు. విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయి రైల్వేజోన్ తో పాటు చట్టంలోని అన్ని హామీలును నెరవేర్చాలని కోరుతున్నారు. శుక్రవారం కూడా మోదీ విశాఖ పర్యటనను రద్దు చేసుకోవాలని కోరుతూ వామపక్షాల నేతలు పి.మధు, రామకృష్ణ, సి.హెచ్.నర్శింగరావు, జె.వి.సత్యనారాయణమూర్తితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి డీఆర్ఎం కార్యాలయం వైపు భారీ ర్యాలీగా బయల్దేరారు. చేతిలో కుండలు పట్టుకొని వాటిపై మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో ముందుకు కదిలారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. తమను అడ్డుకోవద్దని నిరసన తెలపడం తమ హక్కని చెప్పడంతో వామపక్షాల నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో వారు రోడ్డు పై బైటాయించారు. చేతిలో ఉన్న కుండలను బద్దలకొట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరడంతో నేతలను ఈడ్చుకెల్లి అరెస్ట్ చేసి వ్యాన్లులో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. పోలీసులు తీరుపై నేతలు విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేహక్కు లేకుండా పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాకు అన్యాయం చేసిన అడక్కపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. పేదలకు వచ్చిన భాదలు మీకు వస్తే అప్పుడు మీకు తెలుస్తుందటూ ద్వజమెత్తారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం పై సీపీఎం, సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేసారు.


