మోదీ వస్తే మమ్మల్ని అడ్డుకుంటారా
- 11 Views
- admin
- March 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ముందస్తు అనుమతులున్నా తిరగనివ్వలేదు——
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫైర్—————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వస్తే తాము రాష్ట్రంలో పర్యటించకూడదా? ప్రదాని భద్రత పేరుతో తమ యాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము చేపట్టబోయే యాత్రలతో అన్ని కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకున్నామని ఐనా మోదీ వస్తున్నారన్న నెపంతో నగరంలో తన పర్యటనను అడ్డుకోవడం భాదాకరమన్నారు. అధికారంలో ఉన్న ప్రధాని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను తిరగనివ్వకుండా అడ్డుకోవాలని చూడడం భాదాకరమన్నారు. మనది ప్రజాస్వామ్య దేశంమని మేం తిరిగితే ఆయనెందుకు భయపడుతున్నారో చెప్పాలని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ జెండాను చూస్తే మోదీకి వణుకు పడుతుందని తమ నేత రాహుల్ పేరు వింటే ఏం జరుగుతుందోనని ఆంతోణలో ప్రధాని ఉన్నారని విమర్శించారు. తమ యాత్రను అడ్డుకోవడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మోదీ సభ జరిగితే మా సభలు జరగనివ్వరా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేతగాని వాడిలా కల్లిబొల్లి కబుర్లు చెప్పి వెల్లి పోయారని దుయ్యబట్టారు. రైల్వేజోన్ పేరుతో ఏపీ ప్రజలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సైనికుల త్యాగాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని ద్వజమెత్తారు. బీజేపీ అబద్ధాల పార్టీ అని మోదీ మాయల మరాఠీ అని రఘువీరా అన్నారు. ఏపీ అభివ ద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ఏపీకి ప్రత్యేకహోదా తెచ్చి రాష్ట్రాన్ని కాపాడుతామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు పాల్గొనారు.


