ఎంపీకి న్యాయవాది సవాల్!
- 11 Views
- admin
- March 5, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
——————ఎంపి నిధుల వినియోగంలో నిర్లిప్తత ఎందుకు ?
ట్విట్టర్లో ప్రశ్నించిన సుప్రీం న్యాయవాది డి వి రావు—————-
-ఓపెన్ డిబేట్కు ఆహ్వానించగా తప్పించుకున్న ఎంపీ——————
శీకాకుళం, ఫీచర్స్ ఇండియా: శ్రీకాకుళం పార్ల మెంట్ సభ్యునిగా తన పార్లమెంటరీ నియోజక వర్గానికి కేటాయించిన నిధులు వంద శాతం ఖర్చు చేసి అభివృద్ధికి సహకరించాల్సిన కింజరాపు రామ్మో హన్ నాయుడు ఎందుకు నిర్లిప్తత కనబరుస్తున్నారని సుప్రీమ్ కోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు ట్వీట్ చేసారు. జిల్లాలో ఎన్నో పనులు జరగకపోవ డానికి కారణాలు తెలపాలని రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. తనకు తెలిసి ఎంపీ నిధులతో కనీసం ఈ ఐదేళ్లలో 200 పనులు కూడా జరగలేదని, ఎంపీ మాత్రం 1025 పనులు జరిగినట్టు తనకు ట్విట్టర్లో బదులిచ్చారని అన్నారు.
ఈ విషయంలో తిరిగి తాను వివరణ కోరుతూ ఓపెన్ డిబేట్కు సిద్ధమా అని ప్రశ్నించినపుడు బదులివ్వలేదని ఎందుకంటే ఆ పనులు జరగలేదనే విషయం ఆయనకు తెలుసునని డి. వి పేర్కొన్నారు. తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడిగా ఎన్నికల్లో సానుభూతితో గెలిచిన రామ్మోహన్ నాయుడు తన నియోజక వర్గాన్ని పట్టించుకోకుండా, నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో జవాబు చెప్పకుండా ప్రధానిని నచ్చిన పదజాలంతో నిత్యం విమర్శించడం తగదని రామ్మోహన నాయుడుకు న్యాయవాది డి వి హితవు పలికారు. 100% ఎం పి నిధులు ఖర్చు చేయకపోవడం అంటే ఆ నియోజక వర్గం అభివృద్ధి అవసరం లేకపోవడం ఐన కావాలి లేదా ఆ ఎం పి బాధ్యత రాహిత్యమైన కావాలని అయన అన్నారు. ఎం పి నిధుల వినియోగంలో తక్షణం వివరణ ఇచ్చి తన స్వచ్ఛతను నిరూపించు కోవాలని ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడుకు సవాలు విసిరారు.


