విజయారెడ్డి హత్య కేసులో నిందితులు అరెస్ట్
- 20 Views
- admin
- March 5, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
రూ. 10లక్షల75వేలు విలువైన సొత్తు స్వాధీనం————————-
———————–నిందితుడుపై గతంలో 3 కేసులున్నట్లు సీపీ వెల్లడి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కార్పోరేటర్ బి.విజయారెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. వారివద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తుతో పాటు వారు దొంగిలించిన బ్రీజా కారును స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతురాలు విజయారెడ్డిని నిందిరతులు పక్కా ప్రణాళిక ప్రకారమే చంపారని మంగళవారం ఆయన విలేకరులకు వెల్లడించారు.
భీమిలి మండలం గొల్లల తాళ్ల వలసకు చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్, ముడసర్లోవ ఏరియా శ్రీకాంత్ నగర్‌కు చెందిన నీలి రాధికా దేవిలు కలిసి విజయారెడ్డిని హత్య చేసారన్నారు. నింధితుడు హేమంత్‌కుమార్‌పై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, బీమిలి స్టేషన్లో దొంగతనం కేసు ఉన్నాయన్నారు. ఐతే దొంగతనం కేసులో హేమంత్‌కు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడిందని సీపీ లడ్డా పేర్కొన్నారు. గత సంవత్సరం జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మద్దిలపాలెం అలకానంద రియల్ ఎస్టేట్ కంపెనీలో బ్రోకర్‌గా చేరాడని ఆ సమయంలో అదే కంపెనీలో పని చేస్తున్న నీలి రాధికా దేవితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబందంగా మారిందని దీంతో వీరిద్దరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారని ఈ నేపధ్యంలోనే విజయారెడ్డిని హత్య చేసారని సీపీ లడ్డా పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్‌లో పని చేస్తున్న వీరు విజయారెడ్డి నివాసముంటున్న ఇల్లు అమ్ముతారని తెలుసుకొని ఆ ఇంటిని కొనేందుకు గత నెల 23న వీరిద్దరి ప్రణాళికలో భాగంగానే వెళ్లి రూ.కోటి 35 లక్షలుకు కొంటామని ఆమెను నమ్మబలికేలా చేసి ఆ రోజు ఆమెతో మాట్లాడారన్నారు.
ఆ సమయంలో మృతురాలు విజయారెడ్డితో కుశల ప్రశ్నలు వేస్తూ ఆమె ఆస్థి వివరాలు కుటుంబ వివరాలు తెలుసుకు న్నారన్నారు. అనంతరం 24న ఆదివారం ప్లాట్ కొనేందుకు వస్తామని అడ్వాన్స్ కూడా ఇస్తామని చెప్పి వెళ్లిపోయారని సీపీ లడ్డా చెప్పారు. ప్లాన్‌లో భాగంగా వారిద్దరు అనుమానం రాకుండా 24న హేమంత్‌కుమార్ వియారెడ్డికి ఫోన్ చేసి ఈ రోజు కుదరదు 25న వస్తామని చెప్పాడు. విజయారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న హేమంత్ 25 ఉదయాన్నే విజయారెడ్డి ఉన్న ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉండడాన్ని ఆసరాగా తీసుకొని ఆమెపై బలవంతం చేయబోయాడని అనంతరం ఆమెను చంపేందుకు తెచ్చిన కత్తితో విజయారెడ్డి తలపైన, ముఖంపైన, కాళ్లు, చేతులుపైన విచక్షణారహితంగా నరికి హత్య చేసాడన్నారు. అనంతరం ఆమె శవాన్ని బాత్రూం వరకు ఈడ్చుకెళ్లి వదిలేసాడు.
తర్వాత హేమంత్ కుమార్ రక్తపు మరకలతో ఉన్న ఆయన బట్టలను విప్పి స్నానం చేసి విజయారెడ్డి ఇంట్లో ఉన్న బంగారు ఆభర ణాలను దొంగిలించాడు. అక్కడ నుంచి వెళ్లేముందు విజయారెడ్డి ఉన్న ఇంటికి తాళం వేసి ఆమె కారులోనే పరారయ్యాడని సీపీ తెలిపారు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలి స్తున్నామని ముద్దాయిలు ఇద్దరు దొంగిలి ంచిన కారులో చోరీ చేసిన సొత్తుతో రుషికొండ నుంచి వస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేసామన్నారు. నిందితుల వద్ద నుంచి పోయిన బంగారు ఆభరణాలు, కారుతో పాటు హత్యకు వాడిన కత్తి, సుత్తిలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన ఇన్స్పెక్టర్లు ఎస్.శంకర్రావు, ఎం.అవతారం, వై.రవి, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్ఐలు కె.శ్రీనివాస్, కె.కర్రయ్య, ఎన్.వి. భాస్కర రావు, డి.సూరిబాబు, కె.మధుసూధన రావులతో పాటు సిబ్బందిని అభినంది ంచారు.


