ఓటర్లకు ఆన్లైన్ తొలగింపు బెడద
- 14 Views
- admin
- March 5, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
జిల్లాలో 75వేల ఓట్లు తొలగించమంటూ ఆన్లైన్ అభ్యర్ధన—————
యలమంచిలిలో 2,800 తొలగింపు దరఖాస్తులు
4 వేల మంది క్షేత్రస్థాయి పరిశీలన—————
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపు దరఖాస్తులపై ఆందోళన వ్యక్తం అవుతోంద. ఒక్క విశాఖ జిల్లాలోనే 75వేల ఓట్లు తొలగించమంటూ ఆన్లైన్ అభ్యర్ధనలొచ్చాయి. వాటిని పరిశీలిస్తుంటే మేం బతికేవున్నామని ఓటర్లు చెబుతుండటంతో పరిశీలకులు తలలు పట్టుకొంటున్నారు. ఇలా ఆన్లైన్లో వచ్చిన అభ్యర్ధనలు పరిశీలించడనికి జిల్లాలో 4,000 మంది పరిశీలకులు క్షేత్రస్థాయిలో తిరుగుతు
న్నారు. నకిలీ అభ్యర్ధనలతో వారు విస్తుపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ విధమైన నకిలీ ఆన్లైన్ అభ్యర్దనలపై చర్యలు తీసుకోవాలని, కేసులు బనాయిస్తున్నారు. నకిలీ దరఖాస్తుదారులు వాటిని ఎక్కడినుంచి పంపిందీ ఎన్నికల అధికార్లు ఆరా తీస్తున్నారు. దరఖాస్తు పంపినవారి ఐపీ, చిరునామాలు ఇవ్వాలంటూ సీడాక్‌ను కోరారు. అవి వచ్చినతర్వాత అందిన సమాచారం ఆధారంగా ఐటి ఆధారిత కేసులు పెడుతున్నామని ఎన్నికల అధికార్లు చెబుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మందిపై కేసులు బనాయించినట్లు తెలిసింది. నేరం రుజువైతే వారికి 7 ఏళ్లపాటు శిక్షపడే అవకావం ఉంది. యలమంచిలి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోనూ కనీసం 50 ఓట్లు తొలగించడానికి రంగం సిద్దం చేసుకున్నారని ఆ ఫారం 7 దరఖాస్తులు పట్టుకొని స్థానిక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి చెప్పారు. మరీ విచిత్రంగా స్థానిక కట్టుపాలెం వార్డు మెంబరు పండూరు శ్రీనివాసరావు ఓటు గల్లంతవడం గమనించి తిరిగి ఓటుకోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అలాగే పులపర్తి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ఈ తొలగింపు కార్యక్రమంలో రెవెన్యూ విఆర్వోల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
యలమంచిలి నియోజకవర్గంలో… నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఓటర్లను తొలగించమంటూ 2,800 దరఖాస్తులు వచ్చాయని ఇక్కడి యలమంచిలి ఎలక్షన్ డీటీ కుమారస్వామి ఫీచర్స్ ఇండియాకు మంగళవారం తెలిపారు. వాటిని 240 మంది బూత్‌లెవెల్ అధికార్లు పరిశీలించి నివేదిక సమర్పిస్తారని వివరించారు. అనంతరం ఎన్నికల అధికారి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇంతవరకూ ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు చేసిన వారిపై 50 కేసులు నమోదైనట్లు తెలిసింది.


