గాజువాక ఎమ్మెల్యేగా మళ్లీ పల్లాయే కావాలి
- 12 Views
- admin
- March 5, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
గాజువాక, ఫీచర్స్ ఇండియా : జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక నియొజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసురావే పోటీ చేయాలని గాజువాక తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. గాజువాకలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిథి ప్రసాదాల శ్రీను మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కరం కాని సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ఘనత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు దక్కుతుందన్నారు. మాజీ కార్పరేటర్ పల్లా శ్రీనివాసరావు (చిరంజీవి) మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన అన్ని హమీలను పల్లా నెరవేర్చారని అన్నారు.
అటువంటి వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యే అయితే గాజువాక నియోజక వర్గం మరింత అభివద్ది చెందుతుందన్నారు. మరో కార్పరేటర్ గంధం శ్రీను మాట్లాడు
తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గడిచిన ఐదు సంవత్సరాలలో గాజువాక నియోజకవర్గాన్ని అభివద్దిలో నడిపేందుకు అహర్నిశలు కషి చేశారని అటువంటి వ్యక్తే మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలని గాజువాక ప్రజలందరి ఆకాంక్ష అని అన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ రఫి మాట్లాడుతూ గాజువాక నియోజక వర్గంలో ఏ ఎమ్మెల్యే చేపట్టని విధంగా అభివృద్ధి, పనులను పల్లా శ్రీనివాసరావు చేపట్టారన్నారు.
ఎంబీసీ చైర్మన్ కాకి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబొయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని, గాజువాక నియోకవర్గంలో పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కావడం తథ్యం అని జోష్యం చెప్పారు . ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఎన్నికలలో తనపై నమ్మకంతో ప్రజలందరు ఎమ్మెల్యేని చేశారని, ఐదు సంవత్సరాల కాలంలో కార్యకర్తలు , నాయకులు తనవెంటే ఉండి ముందుకి నడిచారనిచ, మీరందరి సహాయ సహకారాలతోనే గాజువాక నియొజకవర్గాన్ని అభివద్ది పథంలో నడిపించానని అన్నారు.
పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకి శిరోధార్యమని చెప్పారు. ఈ సమవేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, చేనేత విభాగం రాష్ట్ర డైరెక్టర్ పప్పు రాజారావు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు విళ్ళ రామ్మోహన్ కుమార్, పులి వెంకటరమణారెడ్డి, సింగూర్ అనంత్, బొండా జగన్, 63వ వార్డు అధ్యక్ష, కార్యదర్సులు గోమాడ వాసు, ఎండి ముర్తజా, మహిళా నాయకులు పాల్గొన్నారు.


