ఏపికి కొత్త డీజీపీ !?
- 8 Views
- admin
- March 6, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఎన్నికల షెడ్యూల్ రాగానే మార్పు !————–
ఠాకూర్ అధికార పక్షానికి అండగా నిలుస్తారని ప్రతిపక్షం ఫిర్యాదు—————
ఫిర్యాదు దృష్ట్యా డీజీపీని పక్కన పెట్టాలని ఈసీ కసరత్తు————
ఇన్చార్జ్ డీజీపీగా గౌతం సవాంగ్‌కు అవకాశం—————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : ఏపికి కొత్త డిజిపి రానున్నారా. ఎన్నికల షెడ్యూల్ రాగానే డిజిపిని మార్చాలని ఎన్నికల సంఘం దష్టి పెట్టినట్లు విశ్వస నీయ సమాచారం. ఇప్పటికే ఏపిలో డిజిపిపై విపక్ష నేత జగన్ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీని పై ఎన్నికల సంఘం ఇప్పు డున్న డిజిపిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై దష్టి సారించింది. డిజిపిపై జగన్
ఫిర్యాదు గత నెలలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైసిపి అధినేత జగన్ డిజిపిపై ఫిర్యాదు చేసారు. ఏపి ప్రస్తుత డిజిపి ఠాకూర్ టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘం దష్టికి తెచ్చారు. తనపై హత్యాయత్నం జరిగిన సమయంలోనూ డిజిపి ఏక పక్షంగా వ్యవహరించారని..ఆయన అధికార పార్టీ నేతలకు మద్దతుగా ఉన్నారని జగన్ ఫిర్యాదు చేసారు. అదే విధంగా..ఏపి నిఘా విభాగం బాస్ ఏబి వెంకటేశ్వర రావు పైనా.. కో ఆర్డినేషన్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్‌ను విధుల నుండి దూరంగా పెట్టాలని జగన్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్దించారు. దీనిలో భాగంగా..ఠాకూర్‌ను ఎన్నికల విధుల నుండి పక్కన పెడితే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గతంలో రామవతార్ యాదవ్ సైతం.. 2009 ఎన్నికల సమయంలో అప్పుడు ఏపి డిజిపిగా ఉన్న రామవతార్ యాదవ్ విషయంలోనూ ఎన్నికల సంఘం ఇదే విధంగా వ్యవహరించింది. అప్పుడు ఎన్నికల్లో యాదవ్ నాటి వైయస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నాటి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..నాడు ఎన్నికల సంఘం డిజిపిగా ఎన్న యాదవ్‌ను పక్కన పెట్టి.. ఎన్నికలు పూర్తయ్యే వరకు సీనియర్ అధికారి మహంతికి డిజిపిగా బాధ్యతలు అప్పగించింది. 2009 ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరిగి యాదవ్‌ను డిజిపిగా నియమించారు.
ఠాకూర్ స్థానంలో సవాంగ్‌కు అవకాశం.. ఇక, ఠాకూర్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల నుండి పక్కన పెట్టాలని ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఠాకూర్ స్థానంలో గతంలో విజయవాడ కమిషనర్‌గా పని చేసి..ప్రస్తుతం విజిలెన్స్ డిజిగా ఉన్న గౌతం సవాంగ్‌కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. డిజిపిగా ఠాకూర్ నియామక సమయంలోనూ ఠాకూర్ పేరు చర్చకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి అప్పుడు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే..ఠాకూర్‌ను తప్పించి గౌతం సవాంగ్ కు అవకాశం ఇస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఇన్ఛార్జ్ డిజిపిగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.


