జిల్లా తెదేపా అభ్యర్ధుల ఖరారు నేడే
- 12 Views
- admin
- March 6, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అనుచరులతో అమరావతికి చేరుతున్న నేతలు—————
తెరవెనుక మంతనాలు—————–
జరుపుతున్న ఆశావహులు—————–
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: జిల్లాలోని తెలుగుదేశం నియోజకవర్గ అభ్యర్ధిత్వాల మీద అలుముకున్న మబ్బులు వీడనున్నాయి. అభ్యర్ధుల్ని ఖరారు చేసే ముహూర్తం దగ్గర పడింది. ఆశావహుల మొహాల్లో ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. అనకాపల్లి పార్లమె ంటు నియోజక వర్గ పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఎవరికి కేటాయిం చాలన్న దానిపై అధిష్టానం తుది చర్చకు రంగం సిద్ధం చేసింది. ఆ చర్చకు ప్రతి నియోజకవర్గం నుంచీ అమరావతికి రావలసిన కార్యాకర్తలకు ఆహ్వానాలు సైతం పంపింది. హెటాహుటిన నాయకులంతా తమ తమ అనుచరులతో అమరావతికి పయనమయ్యారు. ఇప్పటికే కొందరు అక్కడకి చేరుకున్నారు. ఈ చర్చలో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిత్వానికి ఎవరినీ ఎంపిక చేయకపోవచ్చు. మంత్రి చింతకాయల అయ్యన్న తనయుడు విజయ్, డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనందకుమార్, పార్టీలోకి రానున్న కొణతాల రామకృష్ణల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలోని అరకు పార్లమెంటుస్థానం కిశోర్‌చంద్రదేవ్‌కు కేటాయించడం దాదాపు ఖరారైన సంగతే. ఇక మిగిలిన విశాఖ, అనకాపల్లి స్థానాలు కేటాయింపునకు అధిష్టానం ఆచి తూచి అడుగులేస్తోంది. గతంలో కంటే పార్లమెంటు స్థానాల ప్రాముఖ్యత పెరిగిన సంగతి తెలిసిందే. ఒక్క సీటు కూడా ఒదులుకోకూడదన్నది పార్టీ సీరియస్‌గా తీసుకుంది. అందుకు తగ్గట్టు గెలుపు గుర్రాలకే సీటు కేటాయించాలన్న సంగతి నమ్ముతోంది. అందుకే అభ్యర్ధుల ఎంపికలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటోంది. విశాఖ, అనకాపల్లి ఒకటి ఓసీలకు, మరొకటి బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. విశాఖ ఓసీలకు కేటాయించి అక్కడ గీతం అధినేత శ్రీభరత్‌కు పట్టం కట్టాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన అనకాపల్లి సీటు బీసీలకు కేటాయించక తప్పదు. ఇర అసెంబ్లీ స్థానాల సంగతి పరిశీలిస్తే రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌కుమార్ యలమంచిలి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నా ఆయన మనసు మాత్రం విశాఖ ఉత్తరం వైపే ఉందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ముందుగానే చేసుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం అందుకు ససేమిరా కాదు కూడదంటూ యలమంచిలి నుంచే పోటీ చేయమని ఒత్తిడి చేస్తోంది. తప్పని పరిస్థితిలో తలగ్గే పరిస్థితి ఏర్పడింది. రమేష్‌బాబు వద్దంటే మాత్రం లాలం భాసర్ర్రావు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. లాలం మొదట మాడుగుల సీటు ఆశించినట్టు చెప్పుకుంటున్నారు. మిగిలిన స్థానాలు సిటింగ్‌లకే దక్కేలా ఉన్నా గాజువాక పల్లా శ్రీనివాసరావు, పాయకరావుపేట వంగలపూడి అనిత, చోడవరం రాజు స్థానాలు మార్పు కోసం పరిశీలన జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరొక్క రోజు ఓపిక పడితే గురువారం సాయంత్రం నాటికి ఎవరెవరికి ఏ బెర్తు రిజర్వయ్యిందన్నది తేలిపోతుందని తెలుగుదేశం ముఖ్య వర్గీయులు విశదీకరిస్తున్నారు.


