వాట్సప్‌కు పదేళ్లు
- 17 Views
- admin
- March 6, 2019
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
విూ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. అక్షరాలు, నంబర్లు మాత్రమే కాదు.. ఫొటోలు, వీడియోలు కూడా పంపించుకోవచ్చు. వీడియో కాల్ చేసి అవతలి వ్యక్తిని నేరుగా చూస్తూ.. మాట్లాడొచ్చు. అదే.. వాట్సప్. ఈ ఏడాదితో వాట్సప్ వచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి.
అప్పటి వరకు మెసేజ్ అంటే ఎస్సెమ్సెస్ సర్వీస్, లేదంటే యాహూ మెసెంజర్, గూగుల్ చాట్స్, స్కైప్ వంటి సర్వీసులు మాత్రమే ఉండేవి. అవి కూడా పూర్తిస్థాయిలో అప్డేటెడ్గా ఉండేవి కాదు. ఆ సమయంలోనే యాహూ సంస్థ నుంచి ఇద్దరు ఉద్యోగం మానేసి బయటకొచ్చారు. యాహూకు ధీటుగా ఏదైనా చాటింగ్ స్టేషన్ మొదలుపెట్టాలన్న వారి ఆలోచన. దాని ప్రతిరూపమే వాట్సప్గా బయటకొచ్చింది. సరదాగా రూపొందించిన ఆ యాప్ ఇప్పుడు ప్రపంచంలో నెంబర్‌వన్ చాటింగ్ యాప్‌గా ఆదరణ పొందుతున్నది. 2009లో మొదలైన వాట్సప్ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో 2014లో ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లు చెల్లించి వాట్సప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వాట్సప్‌లో రకరకాల ఫీచర్లు తీసుకొచ్చి యూజర్ల సంఖ్య మరింత పెరిగేలా చేసింది.
వినూత్నంగా..: వాట్సప్‌ను ఫేస్బుక్ సొంతం చేసుకున్న తర్వాత రకరకాల ఫీచర్లు తెచ్చి వాట్సప్ విస్తృతం కావడానికి దోహదం చేసింది. ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్ వంటి అధునాతన సదుపాయాలతో వినియోగదారులను ఆకట్టుకుంది. దీంతో పాటే వాట్సప్ పేమెంట్స్ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగులు వాట్సప్‌కి చేరుస్తూ యూజర్ల మెప్పు పొందుతున్నది. విస్తృతంగా విస్తరిస్తున్న అవాస్తవాలు, ఊహాగాన వార్తల వల్ల వాట్సప్ కూడా షేరింగ్ వార్తల నియంత్రణకు అడ్మిన్లకు మాత్రమే అనుమతినిస్తూ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతోపాటే.. భవిష్యత్తులో డార్క్‌మోడ్, ఒక కొత్త సభ్యున్ని గ్రూప్‌లో చేర్చే ముందు సదరు సభ్యుడి అనుమతి తీసుకోవడం, వాట్సప్ ద్వారా పంపిన ఫొటోలు కంప్రెస్ కాకుండా పూర్తి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకునే ఫీచర్లు కూడా రానున్నాయి.
వాట్సప్ వాస్తవాలు: అనయాపైస ఖర్చు లేకుండా తయారుచేసిన వాట్సప్ యాప్‌ను 2009లో ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది. అప్రస్తుతం ఏడుగురిలో ఒకరు నిత్యం వాట్సప్ వాడుతున్నారు. అఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్ రెండింటిలో వాట్సప్ సపోర్ట్ చేస్తుంది. అవీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, లోకేషన్ షేరింగ్, స్టేటస్, వాయిస్ మెసేజ్, ఆడియో, వీడియో, ఫొటో షేరింగ్ ఇలా ఎన్నో ఫీచర్లు నిత్యం అప్డేట్ అవుతున్నాయి. అఈ2ఈ (ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్) అనే ఆప్షన్ ద్వారా మనం చేసిన చాటింగ్ హిస్టరీ ప్రైవసీ కాపాడబడుతుంది. అ ఉచితంగా, ఆ తర్వాత అద్దె చెల్లిస్తూ, మళ్లీ ఉచితంగా వాడుకునేలా వాట్సప్ సేవలు మార్చారు.
అంచెలంచెలుగా..
2009లో..: ఈ సంవత్సరంలో వాట్సప్ లాంచ్ అయింది. ఫొటో, వీడియో షేర్ చేసుకునే సౌకర్యం ఉన్న యాప్‌గా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లను ఆకట్టుకుంది.
2010లో..: ఈ సంవత్సరంలో వాట్సప్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన మరుక్షణమే వేలమంది తమ కరెంట్ లొకేషన్‌ను స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకున్నారు.
2013లో..: వాట్సప్‌లో గ్రూపులు మొదలయింది ఈ ఏడాదిలోనే. వాట్సప్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఒకేచోట చాటింగ్ చేసుకునే సౌకర్యం అన్నమాట.
2014లో..: ఈ ఏడాదిలోనే వాట్సప్ 500 మిలియన్ల యూజర్ల మైలురాయిని చేరుకుంది. అది కాస్త ఫేస్బుక్ గమనించి వాట్సప్‌ని సొంతం చేసుకుంది. మెసేజ్ చదివిన తర్వాత బ్లూటిక్ వచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది కూడా ఈ ఏడాదే.
2015లో..: ఈ ఏడాది జనవరిలో ఫేస్బుక్ వెబ్ వాట్సప్‌ని ప్రవేశపెట్టింది. కంప్యూటర్లో వాట్సప్‌ను ఉపయోగించుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడింది.
2016లో..: బిలియన్ యూజర్లతో వాట్సప్ ప్రపంచపు నంబర్‌వన్ చాటింగ్ యాప్‌గా రికార్డు సృష్టించింది. మనం పంపించిన మెసేజ్‌లు తిరిగి బ్యాకప్ పెట్టుకోవడానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ప్రవేశపెట్టింది.
2017లో..: బిలియన్ యూజర్ల సంఖ్య ఎప్పుడైతే దాటిందో.. అప్పటి నుంచి రోజుకు మిలియన్ డౌన్లోడ్లతో దూసుకుపోతున్నది. ఈ ఏడాది వాట్సప్ స్టేటస్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
2018లో..: ప్రతీ సంవత్సరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సాయంతో అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తున్నది వాట్సప్ యాప్. 2018 నాటికి 1.5 బిలియన్ డౌన్లోడ్లు అయ్యాయి. వాట్సప్ బిజినెస్ యాప్, వాట్సప్ గ్రూప్ చాటింగ్, వాట్సప్ స్టిక్కర్స్ అనే ఫీచర్లను వినియోగదారుల కోరిక మేరకు విడుదల చేసింది.
2019లో..: ఈ ఏడాదితో వాట్సప్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది వాట్సప్ ఐదు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. అవి : వాట్సప్ డార్క్‌మోడ్, వాట్సప్ యాడ్ కాంటాక్ట్ ఫీచర్, వాట్సప్ క్యూఆర్ కోడ్, వాట్సప్ ర్యాంకింగ్ ఫర్ కాంటాక్ట్స్, ప్రైవేట్ రిప్లయ్ వాచ్ టు నౌ మోర్.


