సబ్ రిజిస్ట్రార్ ఎక్కడ?
- 13 Views
- admin
- March 6, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
నాలుగునెలలుగా ఇన్చార్జ్ పాలన———-
నత్తనడకన రిజిష్ట్రేషన్ల ప్రక్రియ————
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జనం వెతలు————–
పట్టించుకోని ఉన్నతాధికారులు—————–
మధురవాడ, ఫీచర్స్ ఇండియా : మధురవాడ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం ఐదు నెలలుగా ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతోంది.
ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చే రిజిష్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను నియమించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిష్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో జనం విసుగెత్తిపోతున్నారు. ఐదు నెలల్లో ఇద్దరు ఇన్చార్జ్ లు నియమించడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మధురవాడ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా భూములకు సంబంధించి రిజష్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మధురవాడ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో రోజుకు కనీసం 100 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
2016 నుంచి మాధవి కుమారి మధురవాడ సబ్ రిజిష్ట్రార్‌గా పనిచేస్తున్నారు. గత ఐదు నెలలుగా ఆమె కార్యాలయానికి రావడం మానేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ షీలాను ఇన్చార్జ్గా నియమించారు.
ఓ వ్యక్తికి చెందిన వివాదంలో ఉన్న స్థలానికి సంబంధించి రిజిష్ట్రేషన్ చేశారు. దీంతో ఆమెపై ఫిర్యాదు రావడంతో విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న రేవతిని డిప్యూటేషన్‌పై ఇన్చార్జ్గా సబ్ రిజిష్ట్రార్‌గా నియమించారు. నెలకో అధికారిని ఇన్చార్జ్గా నియమిస్తుండటంతో రిజిష్ట్రేషన్ల నిమిత్తం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి సబ్ రిజిష్ట్రార్‌ను నియమించాలని జనం కోరుతున్నారు.


