కుట్ర చేస్తున్నారు..జాగ్రత్త
- 12 Views
- admin
- March 7, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
—————మన డేటా చోరీ చేసి.. మనకే ఫోన్లు చేస్తున్నారు
ఫోన్లు చేసేవారిని టీడీపీ కార్యకర్తలు నిలదీయాలి——————–
——————–రాష్ట్రంలో 50 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగన్
టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు————————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : రాష్ట్రంలో 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఫారమ్ 7 దుర్వినియోగం చేశా నని జగనే చెప్పారని, తొలిదశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారన్నారు. అలాగే 2వేల మంది వైసీపీ వాళ్లే 8లక్షల దరఖాస్తులు పెట్టారని, సకాలంలో వేగంగా స్పందించి కుట్రలను అడ్డు కున్నామని సీఎం అన్నారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్లు ఉన్నాయని, టీఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్ ఉన్నాయన్నారు. అయితే… టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారానికి తెగ బడ్డారని చంద్రబాబు అన్నారు.
జగన్ మాయా రాజకీయం మనరాష్ట్రంలో చెల్లదని, వైసీపీ పుట్టిందే మోసాలపైన, నేరాలపైన అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అప్పుడు జగన్ బోగస్ షేర్ల మాయాజాలం చేశారని, ఇప్పుడు జగన్ దొంగఓట్ల మాయాజాలం ప్రారంభించార న్నారు. వైసీపీ అడ్డదారులు-తప్పుడు విధానాలపై అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఓట్లు పోయినవాళ్లంతా వైసీపీని నిలదీ యాలని, ప్రజల్లో దోషిగా వైసీపీని నిల బెట్టాలన్నారు.
ఓట్లను తానే తొలగించినట్లు జగన్ ఒప్పుకున్నాడని.. బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ – 7 కుట్రలు జరిగాయని స్పష్ట మైందన్నారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అను క్షణం అప్రమత్తంగా ఉండి.. వైసీపీ కుట్రల్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. డేటా చోరీ, ఓట్ల తొలగింపు వ్యహారంపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు తన ట్వీట్లో ‘తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి.. అప్పుడే రాష్ట్ర అభివ ద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది. 2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చింది, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశాం. కానీ కొందరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు’అన్నారు. ‘తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి, అప్పుడే రాష్ట్ర అభివ ద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది.
పార్టీలన్నిటికి యాప్లు ఉన్నాయి.. టీఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్లు ఉన్నాయని గుర్తు చేశారు. కాని టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఓట్ల తొలగింపు కుట్రల వెనుక మూడు పార్టీల హస్తం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివద్ధి పథంలో దూసుకుపోతోందని.. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ భరించలేకపోతున్నాయని సీఎం విమర్శించారు. టీడీపీ డేటా దొంగిలించి.. తమకే ఓట్లు వేయాలని వైసీపీ టీడీపీకి ఫోన్లు చేయిస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ నుంచి ఫోన్లు చేసేవారిని టీడీపీ కార్యకర్తలు నిలదీయాలన్నారు. జగన్ కుట్ర ఏపీలో చెల్లదన్నారు.


