చంద్రబాబు మాటలు మహిళలు నమ్మే స్థితిలో లేరు
- 10 Views
- admin
- March 7, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఓటు హక్కును వినియోగించుకోవాలి————
వైసీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి——————–
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : రాష్ట్ర భవిష్యత్తు కోసం మహిళలు తమ ఓటును సక్రమంగా నిర్వర్తించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యువనేత కోలగట్ల శ్రావణి అన్నారు. పట్టణంలోని 32 వ వార్డు బొగ్గుల దిబ్బ లో జరిగిన మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపి ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. నాలుగు సంవత్సరాల 9 నెలల కాలం లో గుర్తుకురాని మహిళలు, ఎన్నికలు సమీపిస్తుం డటంతో చంద్రబాబు మహిళలకు తాయిలాలు ఎర వేశారన్నారు. మనకోసం, పిల్లల భవిష్యత్తు కోసం సరియైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, మహిళలంతా తమ ఓటును సక్రమంగా వినియోగించాలన్నారు. నిత్యం మనతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేసిన వ్యక్తినే ఎన్నుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకునిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3600 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ప్రజా సమస్యలు వింటూ వారికి ఒక భరోసాను ధైర్యాన్ని కల్పించారన్నారు. నవరత్నాలు పథకం ప్రకటనతో ప్రజలలో ఆశలు చిగురించాయి అని, మాట తప్పని మడమ తిప్పని వైయస్సార్ తనయుడిగా జగన్ నవరత్నాలను అమలు చేస్తారని భరోసా ప్రజల్లో కలిగిందన్నారు. 2004వ సంవత్సరంలో విజయనగరం నియోజకవర్గ ప్రజలు సామాన్యుని పరిపాలన చూశారని, కోలగట్ల వీరభద్రస్వామి హయాములో నియోజకవర్గం ఎంతో అభివద్ధి చెందిందన్నారు. రోడ్ల విస్తరణ తో పాటు, జూనియర్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్ెటెన్షన్ కౌంటర్, పేదవాళ్లకు గూడు కల్పించాలనే ధ్యేయంతో పట్టాల పంపిణీ ఇలా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి నాయకత్వానికి బాసటగా మహిళలంతా నిలవాలన్నారు. ఈ సందర్భంగా 32 వార్డు కు చెందిన తెలుగు మహిళ నేత రాపర్తి అనురాధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిళ యువనేత కోలగట్ల శ్రావణి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 32 వార్డు పార్టీ మహిళా అధ్యక్షురాలు గా సుంకరి ఉషా రాణీ, కార్యదర్శి గా పేరుబంది సుజాత లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం నేత బోనేళ ధనలక్ష్మి, పిన్నింటి రామలక్ష్మి, బొట్ట శ్రావ్య లతో పాటు వార్డు మహిళలు గజ్జి కుమారి, అను పాల్గొన్నారు.


