ఆదివారం శెలవు ఇవ్వరా ?…మహిళపై మీకున్న గౌరవం ఇదేనా
- 12 Views
- admin
- March 8, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మండిపడ్డ జీవీఎంసీ మహిళా కార్మికులు———————
ఉద్యోగులకు 147శెలవులిచ్చి మాచేత 365 రోజులు పని చేయిస్తారా——————–
జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన———————-
డాబాగార్డెన్స్ టీచర్స్ ఇండియా: మహిళా దినోత్సవం నాడు జీవీఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులు రోడ్డెక్కారు. వారం శెలవు ఇవ్వరు, పండగ, పబ్బాలకు శెలవులుండవు, ఉద్యోగులకు 147 రోజులు శెలవులిచ్చి మాచేత 365 రోజులు పని చేయిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. కనీసం మహిళా దినోత్సవం నాడు కూడా శెలవు ఇవ్వకుండా పనిలోకి బలవంతంగా రప్పించడం పై ద్వజమెత్తారు. మహిళలకు చట్ట ప్రకారం ఆదివారం తో పాటు తొమ్మిది పబ్లిక్ హాలీడేస్, 15 క్యాజువల్ లీవ్‌లు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదనపు గంటల పని చేయించుకొని ఓవర్ టైం డ్యూటీ చేసినందుకు డబ్బులు కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. మహిళా దినోత్సవం నాడు సంతోషం లేకుండా రోడ్డున పడాల్సి వచ్చిందని ద్వజమెత్తారు. ఆడవారు మరుగుకు వెల్లేందుకు వార్డు ఆఫీసుల్లో మరుగుదొడ్లు కూడా ఉండడంలేదని ఇదేనా మహిళపట్ల మీకున్న చిత్తశుధ్ది అంటూ విరుచుకుపడ్డారు. ఆఫీసుల్లో లైంగిక వేధింపలుకు కమిటీలు వేయ్సి ఉన్నా ఎవరు వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. జీఓ 333 ప్రకారం తమకు రావాల్సిన ఎరియర్స్‌ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంచించడం కాదా అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం వార్డులను, శాధులను శుభ్రం చేసే స్వీపరమ్మలకు శెల్యూట్ కొట్టమని మేము అడగడం లేదని తమని సామాన్య ఉద్యోగుల్లా చూడాలని మాత్రమే కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. నగరంలో 9వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరం కాగా కేవలం 4200 మందితో పని చేయించి తమపై పని భారం మోపడం అరాచకం కాదా అని ప్రశ్నించారు. గెర్రెల మందల్ని తోలినట్లు తమను వార్డుల్లో అటూ ఇటు ఇష్టమొచ్చినట్లు మారుస్తూ పారిశుద్యాన్ని నాశనం చేస్తున్నారని ద్వజమెత్తారు. మహిళల్ని చులకనగా చూడొద్దన్నారు. తక్షణమే పారిశుధ్య సిబ్బందిని పెంచాలన్నారు. నిలిపేసిన వారం శెలవును పునరుద్దరించాలని డిమాండ్ చేసారు. 50శాతం ఎరియర్స్‌ను తో పాటు వేతనాలు చెల్లించాలన్నారు. వార్డు కార్యాలయాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.


