ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలి
- 8 Views
- admin
- March 9, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
డేటా చోరీ సాక్ష్యాలు తుడిచేశామనుకున్నారు————-
టీడీపీతో పెట్టుకున్నవాళ్లు———-బాగుపడలేదు———-
జగన్కు ఓటేస్తే కేసీఆర్కు, మోడీకి వేసినట్టే———
నేతలతో టెలికాన్ఫరెన్స్లో—————సీఎం చంద్రబాబు——————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని..కానీ ఎక్కడో.. ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు.శనివారం పలువురు టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ… వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని..వారు అడ్డంగా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ సాక్ష్యాన్ని తానే బయట పెడతానని వెల్లడించారు.
తెలుగుదేశంతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగు పడలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్ర బాబు అన్నారు. టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యా లన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆ సాక్ష్యాన్ని బయట పెడతానని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. జగన్కు ఓటేస్తే కేసీఆర్కు, నరేంద్రమోదీకి ఓటేసినట్లేనని చంద్రబాబు అన్నారు.
ఫారం-7లో 95శాతం బోగస్ అని ఈసీ అధికారే చెప్పారన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలని, మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా.. అని… వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ప్రజలంతా నిలదీయాలన్నారు. అంతేగా క మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా అని ప్రశ్నించాలని, రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా..అని… రేపు బూత్ల వద్ద ఓటర్లే వైసీపీని నిలదీయాలని పిలుపునిచ్చారు.ఏపీ నీళ్లకు మోకాలడ్డే కేసీఆర్తో జగన్ దోస్తీ చేస్తున్నారని, సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్కు కంటిమంటేనని చంద్రబాబు అన్నారు. నీళ్లు సముద్రంలో కలిసినా టీ ఆర్ఎస్కు ఇష్టమేనని, కానీ వథాగా పోయే నీళ్లు వాడుకున్నా కేసీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు.ఏపీ నదుల అను సందానంపై దేశం మొత్తం ప్రశంసిస్తుండగా కేసీఆర్, జగన్మోహన్రెడ్డికి మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆంధ్రా వాళ్లు ఊడిగం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు.


