వైసీపీకి అధ్యక్షుడు కెసీఆరా?
- 11 Views
- admin
- March 9, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు విమర్శ““““““““`
గోపాలపట్నం, ఫీచర్స్ ఇండియా : ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీకి అధ్యక్షుడిగా తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందని ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకం శెట్టి గణబాబు విమర్శించారు. తన నివాసములోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగైదు రోజుల నుంచి ప్రధానాంశంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేయడంలో కతనిశ్చయులై ఉన్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలు అభిప్రాయాలను సేకరించడం, ఆయా ప్రాంతాల్లో సేవా మిత్ర ను ఉపయోగిస్తూ అభివద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరును ప్రజల కు తెలివి పరచడమే కాకుండా నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు, అభివద్ధి తెలుసుకోవడానికి ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే దురుద్దేశంతో వైయస్సార్ సీపీ ఫామ్.7 ను దుర్వినియోగం చేస్తుందని, వైసీపీకి అనుకూలంగాలేని ఓటర్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి పూనుకుందని విమర్శించారు. అంతేకాకుండా అనేక నేరాలతో సంబంధం ఉన్న వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దారిలోనే నాయకులు కూడా నడవడం దురదష్టకరమని, నియోజకవర్గంలో ఇప్పటికే ఆరువేల ఓట్లను తొలగించే ప్రక్రియను మొదల పెట్టిందన్నారు. నియోజకవర్గంలో మూడు వార్డుల్లో ఓట్లను తొలగించి మోసం చేయడమే కాకుండా ఓటర్ల హక్కులను కాలరాయడానికి పూనుకుందని, రాబోయే రోజుల్లో ప్రజలు రోడ్డెక్కడం ఖాయమన్నారు. ఫారం.7 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని, అలాంటి వారికి సైబర్ నేరం కింద అరెస్టు చేసి జైలు పంపించే ప్రక్రియ రాష్ట్రంలో మొదలైందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల్లో తేల్చుకోవలసిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు.
సింహాచలం భూ సమస్య పరిష్కారం
ఎన్నో ఏళ్లుగా పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. 2008లో 12000 పైచిలుకు ఉన్న స్ట్రక్చర్స్, స్థలాలకు సంబంధించిన దేవస్థానం భూ సమస్యను 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు లోపు ఉండే భూ సమస్యను పరిష్కారం చేయడమే కాకుండా 200 గజాలు లోపు ఉండి, తెల్లకార్డు ఉన్నవారికి ఉచితంగా పట్టాలు ఇవ్వడానికి, 1998 మార్కెట్ రేట్ ప్రకారం 200 గజాలు పైచిలుక ఉన్న స్థలాలకు 7.5 శాతం నిర్ణయించామని, 300 గజాలు స్థలానికి 15 శాతం, మూడు వందల నుండి 500 గజాల వరకు 30 శాతం ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా సింహాచలం దేవస్థానం భూమి కి బదులు రెవెన్యూ భూమి ఇవ్వడానికి ప్రభుత్వము అంగీకారం కుదిరింది. ఉండా త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.


