పోలీస్ స్టేషన్లలో అధునాతన టెక్నాలజీ
- 11 Views
- admin
- March 9, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అంతర్జాతీయ స్థాయిలో పీఎంపాలెం స్టేషన్—————-
ఇది మా పోలీస్ స్టేషన్ అని ప్రజలు చెప్పుకోవాలి————
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి————-
డీజీపీ ఆర్.పి.ఠాకూర్—————-
మధురవాడ/విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఎపి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు టెక్నాలజీ, మౌలిక వసతులతో కూడిన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర డైరెక్టర్ పోలీస్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అన్నారు.
విశాఖలో పీఎంపాలెంలో రూ.కోటి 40లక్షలతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అధునూతన పోలీస్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, వీఎంఆర్డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, జేసీ సృజన, నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డాతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ పోలీస్ స్టేషన్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మరిన్ని పోలీస్ స్టేషన్లును అధునాతన పరికరాలతో తీర్చిదిద్దనున్నామన్నారు. నేరాలపై కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు.
పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో పాటు చురుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మన వ్యవస్థ పటిష్టంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనపై నమ్మకంతో ప్రజలు ఉన్నారని వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది మా పోలీస్‌స్టేషన్ అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్‌కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. అన్ని పోలీస్స్టేషన్లను సర్వీస్ సెంటర్లుగా మార్చేందుకు కషి చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు విశాఖపట్నం ను ఆదర్శంగా మారుస్తామన్నారు. నగరంలో చీటింగ్, గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీని రూపుమాపేందుకు క షి చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఐజీ పాలరాజు తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


