జగన్ కరుడుగట్టిన నేరస్థుడు
- 12 Views
- admin
- March 11, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
——————–ఇప్పటికే చాలామందిని జైలుకు పంపాడు
ప్రతిపక్షనేతపై చంద్రబాబు ఫైర్——————
——————–ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు
కేసీఆర్ నోరు ఎలా మూయించాలో నాకు తెలుసు———————-
————సంక్షేమ పథకాలు ఆపించి ప్రజలకు ద్రోహం చేసే కుట్ర పన్నుతున్నారు
నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : వైసీపీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు అని, ఆయన్ని నమ్మితే జైలుకు పంపుతాడని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేశాడని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్న పార్టీ అని దుయ్య బట్టారు. ఆ పార్టీతో పోరాటంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదన్నారు. ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు అని నిప్పులు చెరిగారు. వాటిని కప్పిపెట్టడానికే మరిన్ని నేరాలు చేస్తున్నారని అన్నారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవన్నారు. ధర్మాన్ని ఏమార్చడం ఎవరి వల్లా కాదని, సత్యానికి ఉన్న శక్తి గొప్పదని పేర్కొన్నారు. ధర్మపోరాటంలో టీడీపీదే విజయం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికల ఎమర్జెన్సీ సమయం అని, ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా పని చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల రోజులు ఎవరికీ సెలవులు లేవని, ఎవరికీ మినహాయింపులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఒక్క నిమిషం కూడా వధా చేయరాదన్నారు. ‘మీ భవిష్యత్తు – మా బాధ్యత’ నినాదంతో ముందుకెళ్దామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల నగారా మోగిందనీ, చాలాముందే సమాయత్తమయ్యా యం అని, ఇప్పటికే 25 ఎంపీ స్థానాల పరిధిలో సమీక్ష పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల తేదీ గడువు ఖచ్చితంగా 30 రోజులే ఉందని, తక్కువ సమయం ఉన్నా సమర్థంగా పనిచేస్తామన్నారు. నెల రోజుల ముందే ఎన్నికలు రావడం పార్టీకే మంచిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ఓట్ల నమోదు, తొలగింపునకు ఐదు రోజులే గడువు ఉందని, ఈ ఐదు రోజులు ప్రతి రోజూ ఓట్లు తనిఖీ చేసుకోవాలని, తుది జాబితా దాకా ఓట్లు ఉన్నాయో లేవో చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ”యుద్ధంలో గెలుపే సిపాయిల లక్ష్యం.. ఎన్నికల్లో గెలుపే టీడీపీ కార్యకర్తల ధ్యేయం” అని పార్టీ క్యాడర్‌ను టీడీపీ దళపతి చంద్రబాబు ఉత్తేజపరిచారు. పార్టీలో విభేదాలకు తావు ఇవ్వకూడదన్నారు. అందరూ పరస్పరం చర్చించుకొని.. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘టీడీపీ గెలుపే లక్ష్యం-మెజారిటీయే ధ్యేయం’ అని పేర్కొన్నారు. కేసీఆర్ విషయమై ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ఆయన నోరు ఎలా మూయించాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ‘మనం అంతా ఓటర్లతో మమేకం అవుతున్నాం.. వాళ్లంతా ఓట్లు తొలగించే కుట్రల్లో ఉన్నారు. మనం గ్రామాలు-వార్డులు తిరిగే పనుల్లో ఉన్నాం. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఫారం-7 ద్వారా కుట్రలు చేస్తున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు పార్టీల కుతంత్రాలకు ఈ ఎన్నికలు సమాధానం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య జరిగే పోరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోల్చారు. ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామని తెలిపారు. ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించి మరింత అప్రమత్తంగా ఉండాలని క్యాడర్‌కు సూచించారు. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అనే తెదేపా నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు. ‘మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ’ అనే నినాదంతో జగన్ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారని గుర్తు చేశారు. దీని బట్టే ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు.
ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని, కేసీఆర్‌కు మనకు అదే తేడా అదేనని చంద్రబాబు అన్నారు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా తమకు ఉందని, చేతకాని వాళ్లం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభివద్ధి చేసిన హైదరాబాద్‌ను దొంగతనంగా అనుభవిస్తూ కుట్రలు పన్నే స్థాయికి వచ్చారని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. నేటి నుంచి నెలరోజుల పాటి ప్రతి ఒక్కరిలోనూ అప్రమత్తత అవసరమని, ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలు కూడా ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. దీన్ని సమర్థంగా ఎండగట్టాలని సూచించారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజులు ముందుకు తీసుకురావడాన్ని సంక్షోభంగా భావించరాదని, దీన్నే అవకాశంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.


