అత్యధిక ఓటర్లున్న నియోజక వర్గం చంద్రగిరి
- 11 Views
- admin
- March 11, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. దానికి తగ్గట్టుగానే ఓటర్ల జాబితా సిద్ధమయ్యింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యలో ఈసారి స్వల్ప పెరుగుదల కనిపించింది. 2014 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 3,67,16,839 మంది ఉండగా, వారిలో 2,89,51,390 మంది అంటే 78.9 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రస్తుతం జరగబోతున్న సాధారణ ఎన్నికల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. గత ఎన్నికలతో సుమారుగా రెండు లక్షల మంది ఓటర్లు పెరిగారు.
పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తం ఓటర్లలో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే, థర్డ్ జెండర్స్ 3,761 మంది ఓటర్లు ఉన్నారు.
అత్యధికంగా ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. ఈ జిల్లాలో 40,13,770 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:
1. శ్రీకాకుళం జిల్లా
మొత్తం ఓటర్లు- 20,64,330
మహిళలు- 10,28,460
పురుషులు- 10,35,623
ఇతరులు- 247
2. విజయనగరం జిల్లా
మొత్తం ఓటర్లు- 17,33,667
మహిళలు- 8,75,222
పురుషులు- 8,58,327
ఇతరులు- 118
3. విశాఖపట్నం జిల్లా
మొత్తం ఓటర్లు- 32,80,028
మహిళలు- 16,48,709
పురుషులు- 16,31,161
ఇతరులు- 158
4. తూర్పు గోదావరి జిల్లా
మొత్తం ఓటర్లు- 40,13,770
మహిళలు- 20,18,747
పురుషులు- 19,94,639
ఇతరులు- 384
5. పశ్చిమ గోదావరి జిల్లా
మొత్తం ఓటర్లు- 30,57,922
మహిళలు- 15,49,155
పురుషులు- 15,08,403
ఇతరులు- 364
6. కృష్ణా జిల్లా
మొత్తం ఓటర్లు- 33,03,592
మహిళలు- 16,69,703
పురుషులు- 16,33,595
ఇతరులు- 294
7. గుంటూరు జిల్లా
మొత్తం ఓటర్లు-37,51,071
మహిళలు- 18,43,098
పురుషులు- 19,07,552
ఇతరులు- 421
8. ప్రకాశం జిల్లా
ఓటర్లు- 24,95,383
మహిళలు- 12,51,823
పురుషులు- 12,43,411
ఇతరులు- 149
9. నెల్లూరు జిల్లా
ఓటర్లు- 22,06,652
మహిళలు- 11,23,624
పురుషులు- 10,82,690
ఇతరులు- 338
10. కడప జిల్లా
మొత్తం ఓటర్లు- 20,56,660
మహిళలు- 10,40,400
పురుషులు- 10,15,964
ఇతరులు- 296
11. కర్నూలు జిల్లా
మొత్తం ఓటర్లు- 28,90,884
మహిళలు- 14,51,258
పురుషులు- 14,39,183
ఇతరులు- 443
12. అనంతపురం జిల్లా
మొత్తం ఓటర్లు- 30,58,909
మహిళలు- 15,18,768
పురుషులు- 15,39,936
ఇతరులు- 204
13. చిత్తూరు జిల్లా
మొత్తం ఓటర్లు- 30,25,222
మహిళలు- 15,03,477
పురుషులు- 15,21,401
ఇతరులు- 344
చంద్రగిరి టాప్
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే 2014 ఎన్నికలప్పుడు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లున్నారు. ఆ తర్వాత స్థానంలో భీమిలి అసెంబ్లీ స్థానం నిలిచింది. అతి తక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా పెడన నిలిచాయి. అయితే, ఈసారి అత్యధిక ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నిలిచింది. ఈ నియోజకవర్గంలో 2,70,495 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,33,434 కాగా, మహిళలు 1,37,018 మంది ఉన్నారు. మరో 43 మంది ఇతరులున్నారు.
ఈసారి కూడా భీమిలి రెండో స్థానంలో నిలిచింది. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు-2,64,520 ఉన్నారు. వారిలో మహిళలు- 1,32,839, పురుషులు- 1,31,671, ఇతరులు-10 మంది ఉన్నారు. అత్యల్పంగా ఓటర్లు కలిగిన అసెంబ్లీ స్థానాల్లో ఈసారి కూడా నరసాపురం, పెడన నిలిచాయి. నరసాపురంలో మొత్తం ఓటర్లు- 1,59,144 ఉన్నారు. వారిలో మహిళలు- 79,416 మంది, పురుషులు- 79,727 మంది ఉండగా ఇతరులు కేవలం ఒకే ఒక్కరు ఉండడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ఆ తర్వాత పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు- 1,59,215 మంది ఉన్నారు. వారిలో మహిళలు- 79,472 మంది కాగా, పురుషులు-79,736 మంది ఇతరులు- 07 మంది ఉన్నారు.
ఇక రాష్ట్రంలోనే ఇతరులు అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నిలిచింది. ఇక్కడ 138 మంది ఇతరులు ఓటర్లుగా నమోదయ్యారు.


