గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజమైపోదు
- 18 Views
- admin
- March 12, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మాజీ కార్పొరేటర్ కోటేశ్వరరావు, శ్యామ్ విమర్శలు—————————
గోపాలపట్నం, ఫీచర్స్ ఇండియా : మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ గట్టిగా మాట్లాడితే అబద్దం నిజమైపోదని మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితం శెట్టి కోటేశ్వరరావు ఉన్నారు. తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ప్రతిపక్ష నాయకులు విజయ ప్రసాద్ తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, ఓటమి భయంతో రాత్రులు నిద్ర పట్టక పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బూతు నెంబర్ 33 లో నా కుటుంబ సభ్యులకు గానీ, నాకు గాని ఎటువంటి ఓట్లు లేవని, ఓటమి భయంతో మీ పార్టీ వాళ్లే నరవ నుంచి ఓటర్లను కలుపుకొని మాపై నిందారోపణలు చేస్తున్నారని, ఓటమి భయం తగ్గించుకొని పార్టీలో పని చేసుకోవాలని సలహా ఇచ్చారు. మాలో మాకు తగాదాలు సష్టించినా మేము ఎప్పటికీ కలిసి గానే ఉంటామని, మా మధ్య రాజకీయాలు చెయ్యొద్దన్నారు. అనంతరం కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పెతకం శెట్టి శ్యామ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా అధికారం లేక ఇంట్లో కూర్చోవడంతో మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివద్ధి ఎటు చూసినా కనబడడంతో ఓటమి భయంతో ఎమ్మెల్యే గణబాబు, మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఏ చోట నుండి అయినా ఎన్నికలలో నిలబడి వచ్చానని, మళ్ల విజయప్రసాద్ పెందుర్తి లో పుట్టి, సీతమ్మదార లో నివాసం ఉంట్షు పశ్చిమ లో పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాకు మొదటినుంచి ఎల్లపు వాని పాలెం లో ఓటు హక్కు ఉందని, బై మిస్టేక్ వలన బూతు నెంబర్ 24 లో 598 ఓటర్ లిస్ట్ లో పడిందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ గా గతంలో వైసీపీ సభ్యులు పోటీకి ప్రయత్నించి నిలవలేకపోయారని తెలిపారు. టీడీపీ హాయంలో సంతోష్ నగర్, డి ఆర్ నగర్ లో పక్కా రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం, నిరుపేదలకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. నీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉంటే మాట్లాడేటప్పుడు సక్రమంగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డు అధ్యక్షులు విజయ్ కుమార్, టీడీపీ నాయకులు దాడి సురేష్, నర్సింగరావు తో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


