తల్లీ కూతుళ్లకు మసకబారుతున్న ‘శోభ’
- 10 Views
- admin
- March 12, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
—-హైమావతి, స్వాతిల ప్రయత్నాలకు గండి———————
దారులన్నీ మూసుకుపోయిన వైనం—————–
రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం———————–
విజయనగరం, ఫీచర్స్ ఇండియా: అతి పిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఏకంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పదవిని అలంకరించి అందరిని ఆశ్చర్య పరిచిన డాక్టర్ శోభాస్వాతిరాణి రాజకీయ భవితవ్యం నేడు ప్రశార్ధకంగా మారబోతుందా? అంటే ఔననే చెపుతున్నారు రాజకీయ పండితులు. తల్లి శోభ హైమావతిదేవి గతంలో ఎస్.కోట ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్ విద్యుత్ సంస్థ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉండడం, 2014లో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి గిరిజన మహిళకు రిజర్వ్ కాబడడం శోభ కుటుంబానికి అదృష్టం వరించినట్లయింది. దంత వైద్య విద్యను పూర్తిచేసి అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన శోభా హైమావతిదేవి కుమర్తె డాక్టర్ శోభ స్వాతిరాణికి జడ్పీటీసీగా వేపాడ మండలం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ వెంటనే జడ్పీ చైర్పర్సన్ పదవి వరించింది. ఐదేళ్లపాటు చైర్పర్సన్ హోదాలో పనిచేసిన స్వాతిరాణి దృష్టి చట్టసభలపై పడింది. జిల్లాలోని గిరిజనులకు కేటాయించిన కురుపాం లేదా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అది కుదరకపోతే అరకు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని పావులు కదిపారు. అనేక రకాలుగా ప్రయత్నించారు. పైరవీలు సాగించారు. అయితే కురుపాం, సాలూరు అసెంబ్లీ స్థానాల నుంచి అక్కడి మాజీ కురుపాం, సాలూరు అసెంబ్లీ స్థానాల నుంచి అక్కడి మాజీ ఎమ్మెల్యేలనే పార్టీ అధిష్టానం అభ్యర్ధులుగా ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ దేవ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తెలుగుదేశంలో చేరి అరకు టికెట్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో స్వాతీరాణికి దారులన్నీ మూసుకుపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆశ నిరాశగానే మిగిలింది. జడ్పీకి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. దీనిని బట్టి స్వాతీరాణికే కాదు ఆమె తల్లి మాజీ ఎమ్మెల్యే హైమావతిదేవిల రాజకీయ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. స్వాతిరాణికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ తప్పక లభిస్తుందని ఆశించిన వారి అనుచరులు నేడు నిరాశకు గురయ్యారు. వీరి భవిష్యత్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతాయన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.


