ఈ కథనాలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరు
- 11 Views
- admin
- March 13, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా: రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించేందుకు ఎల్లో విూడియా మరోమారు జగన్మోహన్ రెడ్డిపై దాడులు మొదలుపెట్టింది. ఎప్పటివో కేసులను తవ్వితీసి అదేదో ఇప్పుడే బయట పడినట్లుగా కలరింగ్ ఇస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు ఎంత అవసరమో అంతకన్నా ఎల్లో విూడియాకూ అవసరం. అందుకనే పోయిన ఎన్నికల్లో జగన్ గెలవకుండా వేసిన ప్లాన్లనే మొదలుపెట్టాయి. అక్రమాస్తుల కేసులని, కేసుల్లో వెలుగు చూసిన కొత్త కోణాలని కథనాలను వండి వారుస్తున్నాయి.
మరో నెలరోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబుతో పాటు ఎవరిలోను నమ్మకాలు కనబడటం లేదు. 25 లోక్ సభ స్ధానాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల కోసం చంద్రబాబు వెతుక్కోవాల్సిన పరిస్ధితులు. ఎవరిని పోటీ చేయమని అడుగుతున్నా అందరూ వెనకాడుతున్నవారే. ఎంపికి అభ్యర్ధులకు దొరక్క ఒకవైపు అవస్తలు పడుతున్నారు. మరోవైపేమో లీకుల్లో ఖరారు చేసిన ఎంఎల్ఏల అభ్యర్ధిత్వాలపై ఆయా నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది.
అంటే ఇటు ఎంపి అభ్యర్ధులు దొరక్క అటు ఎంఎల్ఏలపై వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. అదే సమయంలో టిడిపిలోని అసంతృప్త నేతలందరూ వైసిపిలో చేరిపోతున్నారు. దాంతో ఒకరకంగా చంద్రబాబుకు పిచ్చిపడుతున్నట్లే ఉంది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే టిడిపి గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను ఉన్నట్లు కనబడటం లేదు. ఈ పరిస్ధితుల్లో చంద్రబాబును కాపు కాసేందుకే అన్నట్లుగా ఎల్లో విూడియా రంగంలోకి దిగింది.
రేపటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే టిడిపితో పాటు కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులకు ఎంత నష్టమో పచ్చపత్రికలకు అంతకన్నా ఎక్కువ నష్టమే జరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే ఎలాగైనా జగన్ను మళ్ళీ దెబ్బకొట్టాలనే ప్రయత్నాలు మొదలైంది. అందులో భాగమే పాత కేసులనే కొత్తగా తవ్వి తీస్తున్నాయ్. మామూలుగా జగన్పై చంద్రబాబు ఆరోపణలు చేస్తే జనాలు నమ్మరన్న ఉద్దేశ్యంతోనే పచ్చపత్రికల ద్వారా చెప్పిస్తున్నారు.
అయితే, చంద్రబాబు అయినా పచ్చపత్రికలైన మరచిపోయిన విషయం ఒకటుంది. చంద్రబాబుకు పచ్చపత్రికలకు ఉన్న సంబంధాలు జనాలందరికీ తెలిసినవే. జగన్పై కేసుల విషయాలను సరిగ్గా ఎన్నికలకు ముందే ఎందుకు వండి వారుస్తున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు కారు జనాలు. అదే సమయంలో తనపై రకరకాల కథనాలు వండి వార్చేందుకు పచ్చపత్రికలు రెడీగా ఉన్నాయని ఒకవైపు జగన్ బహిరంగ సభల్లోనే చెప్పారు. కాబట్టి పచ్చపత్రికల్లో కథనాలను జనాలు సీరియస్గా తీసుకుంటారన్న నమ్మకం ఎవరిలోను కనిపించటం లేదు.


