ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివద్ధే మా ధ్యేయం
- 17 Views
- admin
- March 18, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
జన జాగతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత———————
డాబాగార్డెన్స్, ఫీచర్స్ ఇండియా : రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివద్ధి పథంలో నడిపించడమే జన జాగతి పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తపల్లి గీత అన్నారు.
సోమవారం మాధవధార నాయుడు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గీత మాట్లాడారు. టీడీపీ, వైసీపీలు రెడ్డి చౌదరి సామాజిక వర్గానికే అధిక సీట్లు కేటాయించాలని ఆమె అన్నారు. మా పార్టీ నుంచి అధిక సీట్లు బీసీ సామాజికవర్గానికి కేటాయించామని గీత పేర్కొన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళా అభ్యున్నతే మా పార్టీ ధ్యేయమని ఆమె తెలిపారు.
అనంతరం 45 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల మొదట లిస్టును విడుదల చేశారు. ఈ సమావేశంలో పార్టీ జాయింట్ సెక్రెటరీ కే షీలా, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి ఎం నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి నాగ శివ , నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి దండు పాటి కోటేశ్వరరావు, వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.


