పెందుర్తి జనసేన అభ్యర్ధిగా చింతలపూడి
- 17 Views
- admin
- March 18, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
జనసేన అరకు ఎంపీగా పాంగి రాజారావు————-
అనకాపల్లికి పరుచూరి————
మాడుగుల బరిలో సన్యాశినాయుడు—–
చోడవరం నుంచి పీవీఎస్ఎన్ రాజు పోటీ—————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : పవన్ సారథ్యంలోని జనసేన రానున్న ఎన్నికల్లో వామపక్షాలు, బహుజన్ సమాజ్ వాధి పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ద మైంది. ఇందులో భాగంగా వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ 2 లొక్సభ సీట్లు కేటాయించింది. ఐతే బీఎస్సీకి మాత్రం 21 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లును కేటాయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగా రెండో విడతలో అరకు ఎంపీతో పాటు అనకాపల్లి, మాడుగుల, చోడవరం, పెందుర్తి ఎమ్మెల్యే టికెట్లును ప్రకటించారు. అరకు ఎంపీగా పాంగి రాజారావు పేరును ప్రకటించిన పవన్ అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి పరుచూరి భాస్కరరావు, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్దిగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, చోడవరం నియోజకవర్గానికి పి.వి.ఎస్.ఎన్.రాజు, మాడుగుల నుంచి జి.సన్యాశినాయుడులను బరిలోకి దించనన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖ వెస్ట్ ను సీపీఐకు కేటాయించిన పవన్ మిగతా నియోజక వర్గాలకు సంబందించిన పేర్లును త్వరలో ప్రకటించనున్నారు. వీరితో పాటు మచిలీపట్నం ఎంపీగా బండ్రెడ్డి రాము, రాజంపేట ఎంపీగా సయ్యద్ ముకరం చాంద్, శ్రీకాకుళం ఎంపీగా మెట్ట రామారావు (ఐఆర్ఎస్)ను బరిలోకి దించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నేమూరి శంకర్ గౌడ్ పేరును ప్రకటించింది.
అలాగే ఎమ్మెల్యేలుగా దాసరి రాజు (ఇచ్ఛాపురం), గేదెల చైతన్య (పాతపట్నం), రామ్మోహన్ (ఆముదాలవలస), పంతం నానాజీ (కాకినాడ రూరల్), రాయపురెడ్డి ప్రసాద్ (రాజానగరం), అత్తి సత్యనారాయణ (రాజమండ్రి అర్బన్), ఘంటసాల వెంకట లక్ష్మి (దెందులూరు), బొమ్మడి నాయకర్ (నర్సాపురం), అటికల రమ్యశ్రీ (నిడదవోలు), పసుపులేటి రామారావు (తణుకు), జవ్వాది వెంకట విజయరాం (ఆచంట), మేకల ఈశ్వరయ్య (చింతలపూడి), ముత్తంశెట్టి కష్ణారావు (అవనిగడ్డ), అంకెం లక్ష్మీ శ్రీనివాస్ (పెడన), బీవీ రావు (కైకలూరు), పోతిన వెంకట మహేష్ (విజయవాడ పశ్చిమ), బత్తిన రాము (విజయవాడ తూర్పు), షేక్ రియాజ్ (గిద్దలూరు), టి.రాఘవయ్య (కోవూరు (నెల్లూరు జిల్లా), డాక్టర్ కె.రాజగోపాల్ (అనంతపురం అర్బన్), సుంకర శ్రీనివాస్ (కడప), ఎస్కే హసన్ బాషా (రాయచోటి), బొటుకు రమేష్ (దర్శి), రేఖా గౌడ్ (ఎమ్మిగనూరు), చింతా సురేష్ (పాణ్యం), అన్నపురెడ్డి బాల వెంకట్ (నంది కొట్కూరు), విశ్వం ప్రభాకర్‌రెడ్డి (తంబళ్లపల్లె), చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్ (పలమనేరు) పోటీ చేస్తారని పవన్ చెప్పారు. మిగతా అభ్యర్దులను త్వరలోనే ప్రకటించనున్నారు.


