21న గంటా.. కె.కె.రాజు నామినేషన్
- 12 Views
- admin
- March 20, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
నలభై ఏళ్ల అనుభవమున్న మేధావి మోసపోతున్నాడు———–
చంద్రబాబుపై సోము వీర్రాజు మండిపాటు————–
మోదీని ఓడించాలంటూ దుష్ప్రచారం బాబుకు తగదు———–
సర్పంచ్లకు సర్వాధికారాలు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే———–
డాబాగార్డెన్స్, ఫీచర్స్ ఇండియా: రాష్ట్రాభివృద్దికి ప్రధాని నరేంద్రమోదీ ఏవిదంగా సహకరించారో సీఎం చంద్రబాబుకు తెలుసనని ఐనా ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న దురుద్దేశ్యం ఎందుకు కలిగిందో తెలియడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో బీజేపీని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పని చేస్తున్నారని ఎన్నికల్లో కేవలం తమ పార్టీ పైన మోదీ పైన లేని పోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బుదవారంలో విశాఖ బీజేపీ నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం సినీనటుడు శివాజీని, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని తన పంచన చేర్చుకుని బిజేపి పై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కమ్యునిస్టులు చంద్రబాబుతో వున్నారని రాష్ట్రంలో వారు ఎవరితో పొత్తుపెట్టుకున్నారో చూస్తేనే అర్దమవుతుందన్నారు. ఈ పొత్తు ఒక వ్యూహాత్మకమన్నారు. 40 సంవత్సరాల అనుభవముందని చెప్పుకునే మేధావి అబద్దాలను ప్రచారం చేయడం చూస్తుంటే జాలేస్తుందన్నారు. మోడీని దెబ్బతీయాలంటూ చెప్పి చెప్పి తనకు తానే దెబ్బతీసుకుంటున్నారని ఎద్దేవా చేసారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. సర్పంచ్ కు సర్వాధికారాలు ఇచ్చింది మోడీ ప్రభుత్వమేనని చెప్పారు. చంద్రబాబుకు రాజకీయాలు తప్పా…రాష్ట్రాన్ని అభివ ద్ధి చేసే ఉద్దేశంలేదన్నారు. 40 సంవవత్సరాల అనుభవం వున్న చంద్రబాబు గతితప్పి మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. విద్యా, ఆరోగ్యం, రైంతాంగాన్ని గాలికొదిలేసి మద్యం దుకాణాలను మాత్రం వీదివీదినా ఉండేలా చూసారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అవినీతిమయం అయ్యిందన్నారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారన్నారు. ఉత్తరంలో గంటాను ఓడించమంటూ తనకు ఫోన్లు వస్తున్నాయని విష్ణుకుమార్ రాజు చెప్పారు. జి.ఓ.304 ప్రకారం 533 ఎకరాల ల్యాండ్ పూలింగ్ రెండురోజుల్లో ఎలా పూర్తి చేసారో చెప్పాలన్నారు.


