జనసేనాని గెలుపుపై అనుమానాలు
- 12 Views
- admin
- March 20, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
గాజువాకపై సిట్టింగ్ ఎమ్మెల్యేకు పూర్తి పట్టు————–
కలిసి రానున్న సామాజిక వర్గ ఓటింగ్———
వైసీపీ అభ్యర్ధికి జగన్ క్రేజ్, రెడ్ల ఓట్లు————
అటు భీమవరంలో రామాంజనేయులకు———-
ప్రజల్లో మంచి గుర్తింపు, పలుకుబడి————-
అమరావతి, ఫీచర్స్ ఇండియా : చంద్ర బాబు ఎప్పుడూ కులం గురించి మాట్లాడరు. జగన్ కూడా డిటో. ఆయనా కులం గురించి మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభిస్తే చాలు, కులం గురించి మాట్లాడ కుండా వుండలేరు. కులాలకు అతీతంగా రాజకీయం అంటారు. తనకు కులంలేదు అంటారు. కానీ ఇప్పుడు ఆచి తూచి రెండు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక మాత్రం కచ్చితంగా కులాల తూకం మాత్రమే వుంది. అదివాస్తవం. భీమవరంలో గెలుపు నిర్ణయాత్మక శక్తి అక్కడి కాపు ఓటర్లదే. అలాగే గాజువాకలో కాపుల సంఖ్య ఎక్కువగానే వుంది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తరువాత గోదావరి జిల్లాల నుంచి వలస వచ్చిన కాపు ఓటర్ల సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే ఈ లెక్కలు అన్నీతీసిన తరువాతే పవన్ కళ్యాణ్ ఈ రెండుచోట్ల నుంచి పోటీచేయడానికి రెడీ అయ్యారు. ఇది వాస్తవం.
కడప సీటు బిసిలకు ఇవ్వవచ్చు కదా? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏదైనా అర్బన్ నియోజక వర్గం నుంచి పోటీచేసి, కాపులు అధికంగా వున్న ఈ రెండు సీట్లను స్థానికులతో, కాపులకో ఇవ్వవచ్చు కదా? ఆయనకు గెలుపు మీద అంత భయం అన్నమాట. అందుకే విజయం గ్యారంటీ అన్న సీట్లు తనకు వుంచుకున్నారు. కానీ భీమవరం సంగతి అలావుంచితే గాజువాకలో గెలుపు అంత వీజీకాదు. ఎందుకంటే అక్కడ కాపులతో సమానంగా యాదవులు కూడా వున్నారు. తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఆయన తండ్రి సింహాచలం టైమ్ నుంచి నియోజకవర్గం మీద మంచి పట్టు వుంది. ఇక వైకాపా అభ్యర్థి నాగిరెడ్డి బిసి వర్గానికి చెందినవారు. గాజువాక ప్రాంతంలో బిసి రెడ్ల సంఖ్య కూడా కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో వుంది. అదికాక ఇతర కులాల ఓట్లు వుండనే వున్నాయి. ముఖ్యంగా కాస్త ఆలోచించి ఓటు వేయగల అర్బన్ ఓటర్ల సంఖ్య కూడా తక్కువేమీకాదు. ఇక భీమవరంలో తేదేపా అభ్యర్థి రామాంజనేయులు కూడా గట్టి కేండిడేట్నే. ఆయన ఇప్పటికే అనేకసార్లు గెలిచారు. అందువల్ల ఆయన గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. క్షత్రియులు పూర్తిగా వైకాపా వైపు వున్నారు. అందువల్ల వారు తమవంతు ప్రయత్నం తాము చేస్తారు. కేవలం కుర్రకారు ఓటు బ్యాంక్ మీద ఆధారపడి పవన్ ముందుకు సాగాల్సి వుంటుంది. ఏమైనా చిరంజీవి టైమ్‌లో రెండుచోట్ల పోటీచేస్తే ఓ చోట ఝలక్ తప్పలేదు. పవన్‌కు కూడా అలాంటి అనుభవం తప్పదేమో? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


