జనసేన నిండా టీడీపీ కోవర్టులే
- 14 Views
- admin
- March 21, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఒక వైపు ముసుగు పొత్తులు అంటూ విపక్ష వైసీపీతో పాటు, అందరూ టీడీపీ జనసేనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జనసేనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చాలా కాలనగా ఆ పార్టీలో ఉన్న తరువాత చేస్తున్న ఈ కామెంట్స్ పై ఇపుడు అంతా చర్చించు కుంటున్నారు.
విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి పవన్ పార్టీపై లేటెస్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ పెట్టింది అభ్యర్ధులను పెట్టింది జనసేన గెలవడం కోసం కాదని, టీడీపీని గెలిపించడం కోసమేనని ఆమె విమర్శించారు. జనసేన నిండా టీడీపీ కోవర్టులే ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. జనసేన టీడీపీ విూద నిలబెడుతున్న వారంతా డవ్మిూలేనని కూడా కామెంట్స్ చేయడం విశేషం.మొదట్లో మార్పు అంటూ ఊదరగొట్టి యువతను పెద్ద ఎత్తున చేర్చుకున్న పవన్ వారి చేత పని చేయించుకుని ఇపుడు అన్ని చోట్లా బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం ఏంటని ఆమె నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు.
జనసేనలో మార్పు అంటే ఏదో అనుకుని చేరామని, అభ్యర్ధులను మార్చడమే మార్పు అని అర్ధమైందని సెటైర్లు వేశారు. జనసేన తరఫున తన మనవడు రఘు రాజుకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, దీని కోసం అమెరికా నుంచి వచ్చి మరీ పార్టీకి పనిచేసిన మనవడికి ఇపుడు ఏం సమాధానం చె బుతారని ఆమె నిగ్గదీశారు. మరి ఇదే రకమైనా ఆరోపణలను భీమిలీ జనసేన ఆశావహుడు అలీవర్ రాయ్ కూడా చేస్తున్నారు. మొత్తానికి పొత్తు అంటూ విపక్షం అంటూంటే ఆ గుట్టుని ఆ పార్టీ వారే బయట పెడుతున్నారు.


