పోటా పోటీగా నామినేషన్లు
- 10 Views
- admin
- March 22, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పెద్దఎత్తున తరలి వెల్లిన అభిమానులు———-
కలెక్టరేట్లో నామినేషన్ వేసిన వైసీపీ, జనసేన ఎంపీ అభ్యర్ధులు ఎంవీవీ, జేడీ———-
భీమిలి తహశీల్దార్ కార్యాలయంలో అవంతి———-
గాజువాకలో తిప్పల నాగిరెడ్డి————
నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న———–
వెస్ట్ సీపీఐ అభ్యర్ధి జేవీ సత్యనారాయణమూర్తి———–
దక్షిణంలో వైసీపీ అభ్యర్ధి ద్రోణంరాజు, జనసేన———
అభ్యర్ధి గంపల గిరిధర్——–
నార్త్ ఎమ్మార్వో ఆఫీస్లో బీజేపీ అభ్యర్ధి————
విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్ధులు పోటాపోటీగా తమ నామినేషన్లును వేస్తున్నారు. అభిమానులు, నేతలు, బంధువులు నడుమ కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియయను ముగిస్తున్నారు. 23, 24 శెలవు దినాలు కావడంతో అభ్యర్దులంతా తమ పేరు బలాల ప్రకారం 22 శుక్రవారం మంచి ముహూర్తం కావడంతో అభ్యర్దులంతా నామినేషన్ల ప్రక్రియను ముగించారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ తో పాటు జనసేన తరుపున బరిలో దిగుతున్న జేడీ లక్ష్మీనారాయణ నామినేషన్లును వేసారు.
వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ ఉదయం మ11-30కు ఎంవీపీ డబుల్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలతో భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్కడ నుంచి ఎ.ఎస్. రాజా మైదానం , ఉషోదయ జంక్షన్ కూడలి , కరకచెట్టు పోలమాంబ గుడి, రైతు బజార్, రామ్ నగర్, జగదాంబ కూడలి మీదుగా కలెక్టరేట్ కు చేరుకొని నామినేషన్ను వేసారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్ కుమార్, కొయ్యప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఎంపీ అభ్యర్ధి జేడీ లక్ష్మీనారాయణ కూడా అబిమానుల కోలాహలం నడుమ తన నామినేషన్ ను దాఖలు చేసారు. జై జనసేన, జై పవన్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ విశాఖ జిల్లాలో మూడు సభలు పెట్టడంతో కార్యకర్తల్లో హుషారు ఎక్కువైంది. అలాగే వైసీపీ దక్షిణం నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా తన నామినేషన్ దాఖలు చేసారు. భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు ముందుగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆశీశ్శులు తీసుకొని స్వామి వారి చెంతే నామినేషన్ పత్రాలు పై సంతకాలు చేసి అక్కడ నుంచి ఊరేగింపుగా అడవి వరం మీదుగా భీమిలి తహవీల్దార్ కార్యాలయానికి వెల్లి నామినేషన్ వేసారు.
అలాగే గాజువాక వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి కోలాహలం నడుమ నామినేషన్ వేసారు. పశ్చిమ నియోజక వర్గం లో సీపీఐ తరుపున బరిలో దిగుతున్న జేవీ సత్యనారాయణమూర్తి నామినేషన్ దాఖలు చేసారు. దక్షిణం లో జనసేన తరుపున పోటీకి దిగుతున్న గంపల గిరిధర్ కూడా తన నామినేషన్ ను అభిమానులు నడుమ అట్టహాసంగా వేసారు. ఉత్తరంలో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న పి.విష్ణుకుమార్ రాజు పార్టీ శ్రేణులు, అబిమానులు తో కలిసి సీతమ్మధార తహశీల్దార్ ఆఫీస్కు వెల్లి నామినేషన్ వేసారు. అంతకు ముందు అభ్యర్దులందరూ ముందు వారివారి నియోజక వర్గంలో భారీ ఊరేగింపుతో ర్యాలీ చేపట్టారు. నగరమంతా ర్యాలీలతో కిక్కిరిసిపోయింది.
నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు తన నామినేషన్ వేసారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, బందువులు నడుమ ఆయన తన నామినేషన్ వేసారు.


