ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు
- 16 Views
- admin
- March 22, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు—————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతూ వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ, టీఆర్ ఎస్, వైసీపీలు కుట్రల్ని తెలుగు తమ్ముళ్లు చిత్తు చేయాలి. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు. ఎన్నికల్లో రాబోయే 17 రోజులు కీలకమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విభేదాలు పక్కనపెట్టిన నేత లంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్ది కుట్రలు పెరిగిపోతున్నాయని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఎన్నికల వ్యూహాలపై తమ్ముళ్లకు దిశా నిర్దేశం చేశారు.
టీడీపీ నేతలకు వైసీపీ నుంచి ప్రలోభాలు మొదలయ్యాయన్నారు చంద్రబాబు. ఫ్యాక్షన్ ధోరణితో వైసీపీ ప్రవర్తిస్తోందని.. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీలు కుట్రల్ని తెలుగు తమ్ముళ్లు చిత్తు చేయాలన్నారు. జగన్ బాబాయి హత్య కేసు ఆరోపణలు వాళ్ల అనుచరులపైనే వస్తున్నాయని.. నేరస్థులకు సాక్ష్యాలను తారుమారు చేయడం బాగా అలవాటన్నారు. నేరాలు-ఘోరాలకు బ్రాండ్ జగన్ అంబాసిడర్ అయితే.. అభివద్ధి-సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అన్నారు.
ఐటీ దాడులపై కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో స్పందించారు. కేంద్రం చేయించే దాడులకు భయపడేది లేదన్నారు. టీడీపీ అభ్యర్థుల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని.. ఐటీ దాడులు కుట్రలో భాగమేనన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటామంటున్నారు. గురువారం నెల్లూరులో మంత్రి నారాయణ నివాసం, నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు చేశారట. ఈ దాడుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది.


