ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు
- 14 Views
- admin
- March 23, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు———–
జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు తండ్రి చావును రాజకీయం చేస్తున్నారు———–
టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత———
టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు——————
అమరావతి, ఫీచర్స్ ఇండియా : జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఆ కుట్రను చూస్తూ ఊరుకో బోమని స్పష్టంచేశారు. తెలంగాణలో డిక్టేటర్ మాదిరి తయారైన కేసీఆర్.. ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయ డానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు నేతలతో ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని చంద్రబాబు అబి óప్రాయపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతి ఒక్కరూ ఛీకొట్టే పరిస్థితికి కేసీఆర్ తెస్తున్నారని దుయ్య బట్టారు. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పెత్తనం చేస్తా మంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఓటుతో గట్టి గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆనాడు అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌పై ఎంత కోపం, కసి ప్రజలు చూపారో.. ఇప్పుడు వైకాపా పై అంతే ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జగన్‌ది సైకో మనస్తత్వం అని చంద్రబాబు విమర్శిం చారు. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని అభిప్రా యపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద అఫిడవిట్‌ను జగన్ దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్ దాఖలు చేయరని ఎద్దేవాచేశారు. తెలుగుదేశం సభల్లో ప్రజల ఉత్సాహం ఉరకలేస్తోందని, అంతటా తెదేపా పట్ల సానుకూలత కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
రోడ్‌షోలలో ప్రజల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని, టీడీపీ సభల్లో ముస్లిం మహిళలు పెద్దఎత్తున పాల్గొం టున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్ల మన కషికి తగిన ప్రజాదరణ సభల్లో కనిపిస్తోందన్నారు. ఈ 12 రోజులు ఉధ తంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. మన అభివద్ధి-సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోందని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కేసీఆర్ చెడగొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్నవారిపై వేధింపులు, బెదిరింపులకు దిగుతున్నారని, చివరికి అధికారులను కూడా బెదిరించడానికి దిగజారారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కన్నా ఏపీ ఎదుగుతుందనే అక్కసు కేసీఆర్‌దని, గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే కక్ష మోదీదని, టీడీపీ ఎక్కడ శాశ్వతంగా అధికారంలో ఉంటుందో అనే అక్కసు జగన్‌దని చంద్రబాబు విమర్శించారు. ఈ ముగ్గురూ కక్షకట్టి ఏపీపై, టీడీపీపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో టీడీపీనే గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఆంధ్రా ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.


