గాజువాకలో పాగా వేసేదెవరు
- 8 Views
- admin
- March 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పోటీ రసవత్తరం—————
బరిలో హేమాహేమీలు—————
నడిపించే నాయకుడు లేక అయోమయంలో జనసేన—————–
దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్ధి పల్లా—————–
ఎదురులేని వైసీపీ అభ్యర్ధి నాగిరెడ్డి———————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ వారి వారి వ్యూహాలతో అనేక హామీలిస్తూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ రెండు ప్రధానపార్టీలకు ధీటుగా ప్రశ్నించేందుకే జనసేన పార్టీని స్థాపించానని చెబుతున్న పవన్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. వీటితోపాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా గెలుపుకోసం వారి వ్యూహరచనలతో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలో 175 అసంబ్లీస్థానాలు, 25 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 13 జిల్లాలో విశాఖకు ప్రత్యేక స్థానం వుంది. విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుండగా అందులో గాజువాక నియోజక వర్గం రాష్ట్రంలో మొత్తం 175 నియోజక వర్గాలలో చాలా ముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పోటి చేసే ఏ వ్యక్తి కూడా గాజువాక నియోజకవర్గం నుండి పోటి చేయలేదని అటువంటిది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడినుండి బరిలోకి దిగడం గాజువా మారుమోగిపోతోంది. ఈ నియోజకవర్గానికి జనసేన పార్టికి ఒక సరైన మార్గదర్శకుడు లేక పార్టీకి మనుగడలేకుండా పొతోందని అభిమానుల అవేదన చెందుతున్నారు. మొన్నటివరకు జనసేన పార్టీని సినియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి, కొందరు సినియర్ నాయకులు ఉత్తరాంధ్ర, చిరంజీవి యువత అధ్యక్షులు చిరంజీవి అభిమాని పొలారౌతు వెంకటరమణ భుజ స్కందాలపై మోసి జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లి బలోపెతం చేసి నిలబెట్టారన్న సంగతి తెలిసిన విషయమే. అటువంటి పార్టీకి ఈరోజు గాజువాకలో ఒక పార్టీ కార్యాలయం లేక, సరైన నాయకులు లేక అసలు జనసేన పార్టీ గాజువాకలో పోటి చేస్తుందా అని అనుమానం కలిగె విధంగా ఉండటంతో, కొంత మంది జనసైనుకులకు అర్థంకాని ప్రశ్న. పార్టీ అధినేతే పోటి చేస్తున్న నియోజకవర్గంలో ఇలా ఉంటె మరి మిగత నియోజకవర్గాల్లో జనసేన పరిస్తితి ఏమిటని అభిమానుల మనసులను తొలుస్తున్న ప్రశ్న. పార్టీ అధినేతే రంగంలోకి దిగితే పార్టీ గెలుస్తుందని చెప్పలేని పరిస్థిలో జనసేన ఉందంటే పార్టీ యొక్క ఉనికేమిటో అర్ధమవుతోంది.
టిడిపి నుండి స్థానికుడు, ఒకసారి ఎమ్మెల్యే చేసిన అనుభవం, యాదవ సమాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు పోటి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నుండి స్థానికుడు, మంచి ప్రజాదరణ ఉన్న నేత, నియోజక ర్గంలో ఉన్న సమస్యలను వడబోసిన నాయకుడు తిప్పల నాగిరెడ్డి పోటి చేస్తుంటే ఇటువంటి అంగ, అర్ధ బలం అన్నిటికి మించి ప్రజా బలమున్న నేతలు బరిలో దిగుతుంటే జనసేన పార్టీ నుండి అధినేతే బరిలోకి దిగినా గెలుస్తామనే నమ్మకం జనసైనికు లలో లేకపోవడం వారు కొంత కలత చెందుతున్న విషయం. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేస్తున్న జనసేన అభిమానులు తీవ్ర అయోమయంలో కనిపిస్తున్నారు.
గాజువాకలో మొట్టమొదటి పార్టీ కార్యలయాన్ని స్థాపించింది చిరంజీవి అభిమాని తిప్పల రమణారెడ్డి అని గాజువాక నియోజక వర్గంలో ఇదొక్కటే కార్యలయం కావడం ఆశ్చర్యం. కొందరు బడా నాయకులు గాజువాక నియోజకవర్గంలో రంగప్రవేశం చేసి కష్టబడుతున్న నాయకులపై తప్పుడు సమాచారం అధినేతకు అందించడం చాలా బాధాకరమని అభిమానుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీకి పూర్వ వైభవం వచ్చి అధికారం చేజిక్కించుకోవాలంటే స్థానికుడై ఉండి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, అభిమానులందరినీ కలుపుకు నిపోయే సరైన నాయకుడిని ఇంచార్జ్‌గా నియమిం చాలని అభిమానులు, జనసైనికులు కోరుతున్నారు. లేకపోతే ఈ ఎన్నికల్లో పవన్ గెలుపు కష్టమేనని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


