బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- 10 Views
- admin
- March 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఏడుగురికి తీవ్ర గాయాలు———–
ఇద్దరి పరిస్థితి విషమం—————-
సబ్బవరం, ఫీచర్స్ ఇండియా : బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. గుల్లిపల్లి గ్రామం శ్రీభూలోకమాంబ ఫైర్ వర్క్స్‌లో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో స్థాని కులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలకు తోడు బాణసంచా కాలిపోవడంతో పెద్ద పేలుడు సంభవించినట్టు
స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో బణసంచా తయారీ దుకాణంలో పనిచేస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 2012లో ఇదే తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే కేంద్రంలో పేలుడు సంభవించడంతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


