ప్రియాంక రామభక్తి.. రాహుల్ శివభక్తి
- 10 Views
- admin
- March 26, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
న్యూఢిల్లీ, మార్చి 25: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అయోధ్య పర్యటన ఈ నెల 27న ఖరారు అయిన నేపథ్యంలో ఆమెను రామ భక్తురాలిగా చిత్రీకరిస్తూ వెలసిన పోస్టర్లు అయోధ్య నగరంలో హల్ చల్ చేస్తున్నాయి. పోస్టర్లో రాహుల్, ప్రియాంక రాముడికి నమస్కరిస్తున్నట్లు ఇరువైపులా నిల్చోవడం కనిపిస్తున్నది. పోస్టర్ విషయమై యూపీ మంత్రి మొహ సిన్ రజా మాట్లాడుతూ.. ఎవరైతే, రాముడి ఉనికిని ప్రశ్నించారో.. వాళ్ళే, అయోధ్యకు వెళ్తున్నారు అంటూ విమర్శిం చారు. కాగా, ఫిబ్రవరి నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రైతులు నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని పది తలల రావణాసురుడిగా, రాహుల్ గాంధీని రాముడి అవతారంగా చిత్రీకరిస్తూ పలు బ్యానర్లు వెలిశాయి.
మోదీ ఫోటో కింద చౌకీదారు దొంగ అని రాస్తూనే, దొంగల్లారా.. విూ రోజులు దగ్గరబడ్డాయి, మేము రామ భక్తులం, మాకు దొంగలతో తప్ప, వేరేవారితో వైరం లేదు అంటూ సదరు పోస్టరుపై కొన్ని వాక్యాలు కనిపించడం పెద్ద దుమారాన్నే రేపాయి. గతంలో రాహుల్ గాంధీ తాను శివభక్తుడినని చెప్పు కోవడమే గాక, కర్ణాటక ఎన్నికల సమయంలో శివాలయాలన్నింటినీ వరుసబెట్టి తిరగ డం తెలిసిందే.


