నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి
- 13 Views
- admin
- March 26, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్——————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్ధులను ఖరారు చేయాలని తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ స్క్రూట్నీ అధికారులను కోరారు. మంగళవారం స్థానిక హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని క్షమించకూడదన్నారు. విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్రప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నారని, ఆ పదవికి రాజీనామా చేయకుండా ఆమె ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడం సమంజసం కాదన్నారు. అలాగే 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు నామినేషన్ పత్రంలోని 11వ కోలమ్లో తాను పెద్ద చదువులు చదవలేదని, సంతకం పెట్టి మరీ ఇచ్చారని అన్నారు. వాస్తవానికి ఆయన చదువుపై కూడా అధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్ధులు సమాచారాన్ని దాచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు ఎంతటి వారినైనా అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని క్షమించరాదని కోరారు. దీనిపై ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.


