డాక్టరమ్మ ప్రచారానికి విశేష స్పందన
- 15 Views
- admin
- March 26, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారంలో వైసీపీ ఎంపీ కాండ్రేగుల వెంకట సత్యవతి దూసుకుపోతున్నారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ గైనకాలజిస్టుగా డాక్టర్ వృత్తిలో ఉన్న పరిచయాలతో తనదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, రత్నాకర్ పార్టీలోకి రావడంతో మరింతగా ప్రచారంలో దూకుడు పెంచారు. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులు పీలా గోవిందసత్యనారాయణ, ఆడారి ఆనంద్‌కుమార్ ప్రచారంలో చతికిలపడినట్లు తెలుస్తుంది. తెలుగుదే శంపార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలలో చెప్తున్నప్పటికీ ప్రజలు ఇంతగా ఆశక్తి చూపకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి తెలుగుదేశంపార్టీ మేకపోతు గాంభిర్యం ప్రదర్సిస్తున్నప్పటికీ ప్రజలలో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని తక్కువచేసి మాట్లాడటం, జగన్మోహన్రెడ్డిపై నోటి దురుసుగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలలో తగిన గుణపాటం చెప్తారని ప్రజలే బాహాటంగా అనుకుంటున్నారు. డాక్టర్ సత్యవతి ఏడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని నిర్వహించి నేతలందరిని కలుపుకు పోతున్నారు. సీనియర్ నేత కొణతాల రామకృష్ణ, వైఎస్ఆర్పార్టీ సీటు రాకపోవడంతో మౌనంగా ఉంటూ ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీకి మద్దతు ప్రకటించి, అభ్యర్దుల తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటికీ ప్రజలన నుంచి స్పందన అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ స్దానిక సమస్యలు పరిష్కరించాలన్నా నిరుద్యోగ సమస్యల నిర్మూలన, సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నా, జగన్ లాంటి సమర్దుడిని ముఖ్యమంత్రిని చేయాలంటూ వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి సిఎం అయితే రాష్ట్రానికి జరిగే ప్రయోజ నాలను ఓటర్లకు వివరిస్తున్నారు. తెలుగుదే శంపార్టీ నాయకుల మాటల ఉచ్చులో పడకుండా ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. డాక్టర్ సత్యవతికి, గుడివాడ అమర్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. మహిళలు అనేక చోట్ల హారతులు పట్టారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, డాక్టర్ విష్ణుమూర్తి, మాజీ కౌన్సిలర్లు విల్లూరి శివన్నారాయణ, కొణతాల సత్యనారాయణ, యల్లపు చంద్రమోహన్, బొడ్డేడ శంకరరావు, మళ్ల రాజా, కోరిబిల్లి పరి, జాజుల రమేష, గొర్లి సూరిబాబు, మళ్ల బుల్లిబాబు, తదితర నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేసారు.


